భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) , హైదరాబాద్ నుండి సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
సంబంధిత విభాగంలో డిగ్రీ / బి.టెక్ మరియు పీజీ / ఎం.టెక్ ఉత్తీర్ణత సాధించిన వారు లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 31 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (ఫారెస్ట్రీ & ఎకాలజీ) – 02
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఇన్ఫర్మాటిక్స్) – 02
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియోలాజి) – 05
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఫిజిక్స్) – 02
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (అర్బన్ స్టడీస్) – 06
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (వాటర్ రిసోర్సెస్) – 04
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఇన్ఫర్మాటిక్స్) -10
🔥 విద్యార్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / బి.టెక్ ఉత్తీర్ణత సాధించి & పీజీ/ ఏం.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.
31/08/2025 లోగా విద్యార్హత కలిగి వుండాలి.
సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA తో B.E/ B. టెక్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో వాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
🔥 వయోపరిమితి :
వయస్సు నిర్ధారణ కొరకు 30/05/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
పోస్ట్ కోడ్ ఆధారంగా కొన్ని ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు గల వారు & కొన్ని ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా 750/- రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వారి కి వ్రాత పరీక్ష అనంతరం 750/- రూపాయలు రిఫండ్ లభిస్తుంది.
మిగతా అందరు అభ్యర్థులకు 500/- రూపాయలు రిఫండ్ లభిస్తుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఎంపిక విధానం:
అభ్యర్థులను రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహణ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష కేంద్రాలు :
దేశవ్యాప్తంగా మొత్తం 10 ప్రధాన నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో అయితే తెలంగాణ లోని హైదరాబాద్ ను ఎంపిక చేశారు.
🔥 జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 85,833/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 10/05/2025 (ఉదయం 10:00 గంటల నుండి)
ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30/05/2025 (సాయంత్రం 05:00 గంటల లోగా)
👉 Click here for official website