తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసిస్ట్ గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ మార్కులు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నార్మలైజేషన్ చేసిన తర్వాత అభ్యర్థులు మార్కులను ప్రకటించడం జరిగింది. ఆరు డెసిమల్ నెంబర్స్ వరకు నార్మలైజేషన్ మార్కులు ఉంటాయి..
తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 30-11-2024 తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. 03-12-2024 తేదీన ప్రాథమిక “కీ” కూడా విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 5వ తేదీ వరకు ప్రాథమిక “కీ” పై అభ్యంతరాలను అభ్యర్థుల నుంచి స్వీకరించారు.
ప్రాథమిక “కీ” విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. Key Committee సెషన్-2 లో Question ID No.811427487 తప్ప మిగతా ప్రశ్నలకు జవాబులు సరిగ్గా నే ఉన్నాయని భావించింది. Question ID No.811427487 జవాబును ఆప్షన్ 3 నుండి 1 మరియు 3 గా మార్చింది. ఈ సవరణతో కలుపుకొని ప్రాథమిక ” కీ ” ను ఫైనల్ ” కీ ” గా ప్రకటించడం జరిగింది.
ఫైనల్ “కీ” ఆధారంగా అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ చేసి ప్రస్తుతం ఫలితాలను ప్రకటించడం జరిగింది.
అభ్యర్థులు తమ మార్కులను తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై తమ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
🏹 Pharmacist Grade-2 Results – Click here