తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ (MHSRB Lab Technician Provisional Merit List Released) ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు తెలియజేసిన వివరాలు ప్రకారం ఆగస్టు 6వ తేదీన ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆగస్టు 7వ తేదీ ఉదయం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు ఈ ప్రొవిజినల్ జాబితా విడుదల చేశారు.
MHSRB Lab Technician Provisional Merit List Released :
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 2024లో సెప్టెంబర్ 11వ తేదీన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నవంబర్ 10, 2024వ తేదీన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించడం జరిగింది. 24,045 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయగా వారిలో 23,323 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్ష జరిగిన అనంతరం 2024లో నవంబర్ 12వ తేదీన ప్రాథమిక కీ ను విడుదల చేయడం జరిగింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత 2025లో మార్చి 10వ తేదీన ఫైనల్ కీ ను విడుదల చేశారు.
2025 లో జూన్ 6వ తేదీన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల వివరాలతో జాబితాను విడుదల చేసి అభ్యర్థుల నుండి అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఆగస్టు 7వ తేదీన ప్రయోజనాలు జాబితాను విడుదల చేయడం జరిగింది.
ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసిన సందర్భంగా రెగ్యులర్ సర్వీస్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వారికి కాంట్రాక్టు లేదా ఔటర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ వెయిటేజీ పాయింట్లు పరిగణలోకి తీసుకోమని బోర్డు తెలిపింది.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదలైన ప్రయోజనల్ జాబితాలో ప్రస్తుతానికి అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు వెయిటేజి పాయింట్లు మాత్రమే వెరిఫై చేయడం జరిగిందని అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు నమోదు చేసిన వివరాలు వెరిఫై చేయలేదు అని సార్క్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేసే సమయంలో మిగతా వివరాలు వెరిఫై చేస్తామని బోర్డు అధికారులు తెలియజేశారు.
✅ Official Website – Click here