Meri Panchayat App మీ పంచాయితీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటి ? వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు ? మీ పంచాయతీలో ఎన్నికైన ప్రతినిధులు, సభ్యుల వివరాలు, అధికారులు వారి పనితీరు , మీ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ నుండి కేటాయించిన బడ్జెట్ ఎంత ? ఖర్చు చేశారు? ఆడిట్ నివేదికలు ఇలాంటి వాటి వివరాలు అన్నీ మీరు ఎవరికీ అడగకుండా చాలా సులభంగా మీ మొబైల్ లో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.. దేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం Meri Panchayat App అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ మీరు మీ మొబైల్ లో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ Join Our Telegram Group – Click here
How to Download Meri Panchayat App :
మీరు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి Meri Panchayat App అని Search చేసి App Download చేసుకోండి. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని Sign-up అవ్వాలి.
Sign-up అయిన తర్వాత మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం కనిపిస్తుంది.
✅ Download Meri Panchayat App – Click here
Meri Panchayat App ఎన్ని భాషల్లో వాడవచ్చు :
మేరీ పంచాయతీ యాప్ ను 14 భాషల్లో వాడుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, నేపాలి, ఒడియా, పంజాబీ తమిళ్, సింది, ఉర్దూ భాషల్లో ఈ యాప్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Meri Panchayat App లో ఉండే వివరాలు :
- మీ పంచాయతీకి సంబంధించిన బడ్జెట్ మరియు ఖర్చులు వివరాలు తెలుసుకోవచ్చు.
- పాలకవర్గం ఖర్చులను ఆడిట్ చేసిన సమాచారం మరియు లోపాల నివేదికలు కూడా తెలుసుకోవచ్చు
- సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు వంటి వారి వివరాలు తెలుసుకోవచ్చు.
- మీ గ్రామ పంచాయతీలో జరుగుతున్న ప్రాజెక్టుల స్థలాలను GPS లోకేషన్ తో గుర్తించవచ్చు.
Meri Panchayat App ఉపయోగాలు ఏమిటి ? :
- ప్రభుత్వ నిధుల వినియోగంపై స్పష్టత వస్తుంది. పారదర్శకత పెరుగుతుంది.
- ప్రజలకు లోపాలను గుర్తించి ప్రశ్నించే అవకాశం కలుగుతుంది.
- పాలకులు బాధ్యత యుతంగా పనిచేస్తారు. తప్పులు దాచడానికి అవకాశం ఉండదు.