LIC AAO Notification 2025 in Telugu : ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థ నుండి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – జనరలిస్ట్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 350 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా , ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సమగ్ర సమాచారం అనగా ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు ? దరఖాస్తు విధానం ఏమిటి? అర్హత వయస్సు ఎంత ? ఈ ఉద్యోగాలను పొందితే ఎంత జీతం వస్తుంది ? ఎంపిక విధానం ఏమిటి? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥LIC AAO భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – జనరలిస్ట్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 భర్తీ చేయబోయే LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగాల సంఖ్య :
- దేశవ్యాప్తంగా మొత్తం 350 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో కరెంట్ ఇయర్ ఖాళీలు 341 మరియు బ్యాక్ లాక్ ఖాళీల 09.
- రిజర్వేషన్ల వారీగా ఖాళీల సంఖ్య :
- SC – 51
- ST – 28
- OBC – 91
- EWS – 38
- UR – 142
🔥LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు అవసరగు విద్యార్హత :
- గుర్తింపు పొందిన భారత యూనివర్సిటీ / సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
🔥 LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు అవసరమగు వయస్సు :
- AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం :
- AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్ధతుల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకుగాను ఆకాశం కల్పించడం లేదు.
- దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టి , దివ్యాంగ అభ్యర్థులు 85 రూపాయల ఇంటిమేషన్ ఫీజును చెల్లించాలి.
- మిగతా అందరు అభ్యర్థులు 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అదనంగా ట్రాన్జక్షన్ చార్జెస్ మరియు జిఎస్టి ను భరించాల్సి ఉంటుంది.
🔥 LIC AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు ఎంపిక చేయు విధానం :
- AAO – జనరలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడు అంచెల విధానం ( ప్రిలిమినరీ పరీక్ష , మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ) ద్వారా ఎంపిక చేస్తారు. అలానే ప్రీ – రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారు.
- ప్రిలిమినరీ వ్రాత పరీక్ష : ఇందులో భాగంగా మొత్తం 100 ప్రశ్నలుంటాయి ,70 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ ( 35 ప్రశ్నలకు గాను 35 markuku ) ఆప్టిట్యూడ్ ( 35 ప్రశ్నలకు గాను 35 మార్కులు ) , ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( 30 ప్రశ్నలకు 30 మార్కులు) కేటాయించారు. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క విభాగానికి 20 నిమిషాలు చొప్పున కేటాయించడం జరిగింది.
- మెయిన్స్ వ్రాత పరీక్ష : మెయిన్స్ వ్రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ పరీక్షకు 300 మార్కులు మరియు డిస్క్రిప్టివ్ పరీక్షకు 25 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా రీజనింగ్ ఎబిలిటీ ( 30 ప్రశ్నలకు 90 మార్కులు ) , జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ ( 30 ప్రశ్నలకు 60 మార్కులు ) , డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటిషన్ ( 30 ప్రశ్నలకు 90 మార్కులు ) , ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్( 30 ప్రశ్నలకు 90 మార్కులు ) సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ మరియు డేటా ఎనాలసిస్ విభాగాలకు ఒక్కొక్క విభాగానికి 40 నిమిషాలు, జనరల్ నాలెడ్జ్ మరియు ఇన్సూరెన్స్ విభాగాలకు ఒక్కొక్క విభాగానికి 20 నిమిషాలు చొప్పున మొత్తం మెయిన్స్ పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించారు. దీనితోపాటుగా డిస్క్రిప్టివ్ పరీక్షగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులకు గాను రెండు ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పరీక్షకు 30 నిమిషాలు కేటాయించారు. మెయిన్స్ పరీక్షలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిటివ్ పరీక్ష కేవలం క్వాలిఫై నేచర్ మాత్రమే.
🔥 AAO – జనరలిస్ట్ జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు 88,635/- రూపాయల బేసిక్ పే తో పాటుగా అన్ని అలవెన్సులు లభిస్తాయి.
- వీరికి ప్రారంభ జీతం గా 1,26,000/- రూపాయలు లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 16/08/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08/09/2025
- ఆన్లైన్ ఎగ్జామినేషన్ కొరకు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేయుట : పరీక్షకు ఏడు రోజులు ముందు.
- ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణ (తాత్కాలికం) : 03/10/2025
- మెయిన్స్ రాత పరీక్ష నిర్వహణ (తాత్కాలికం) : 08/11/2025
ఇది LIC సంస్థ నుండి డిగ్రీ అర్హత తో వచ్చిన చాలా మంచి నోటిఫికేషన్. అభ్యర్థులకు ఈ ఉద్యోగాలను పొందేందుకు , ప్రిపేర్ అయ్యేందుకు సరిపడే సమయం కూడా అందుబాటులో ఉంది. బ్యాంకింగ్ , SSC ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈ ఉద్యోగాలపై దృష్టి పెడితే వారికి ఇది ఒక మంచి అవకాశం గా ఉంటుంది. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ పై లింక్ చేసి , నోటిఫికేషన్ వివరాలను మరొకసారి పూర్తిగా చదివి , అర్హత ఆసక్తి ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోగలరు.
👉 Click here for Official Notification