LIC భీమా సఖి పథకం | LIC Bhima Sakhi Qualification, Apply Process, Salary, Selection Process Details

LIC భీమా సఖీ పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

LIC భీమా సఖీ పథకం వివరాలు : అతిపెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థ నుండి భీమా సఖి (mahila career agents) నియామకాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

గ్రామీణ ప్రాంతాలలో గల మహిళల సాధికారత పెంపొందించేందుకు మరియు ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచేందుకు , మహిళలకు హార్దిక స్వాతంత్రం కల్పించింది గాను ఉద్దేశించిన ప్రముఖ పథకం భీమా సఖి యోజన. బీమా సఖి గా ఎంపిక కాబడిన వారికి శిక్షణ అందించి స్టైఫండ్ కూడా ఇస్తారు.

బీమా సఖిగా పనిచేసేందుకు అర్హతలు ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? ఎంత వయస్సు ఉండాలి ? స్టైఫండ్ లేదా కమిషన్ ఏ విధంగా లభిస్తుంది ? వంటి అంశాల సమగ్ర సమాచారం కోసం ఈ ఆర్టికల్ న చివరి వరకు చదవగలరు.

🔥LIC భీమా సఖీ నియామకం చేపడుతున్న సంస్థ :

  • లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ( LIC ) ఈ నియామకాలను చేపడుతుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • దేశవ్యాప్తంగా బీమా సఖి (mahila career agents) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అవసరమగు వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి ఉండి 70 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు బీమా సఖీగా రిజిస్టర్ అయ్యేందుకు అవకాశం కల్పించారు.

🔥 విద్యార్హతలు మరియు ఇతర అర్హతలు :

  • కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • స్వయం సహాయక సంఘాల సభ్యులు ( SHG) / డ్వాక్రా సభ్యులు అయి ఉండాలి .
  • ప్రస్తుతం LIC నందు ఏజెంట్ గా మరియు ఉద్యోగిగా పనిచేస్తున్న వారు మరియు వారి కుటుంబ సభ్యులు మహిళా కెరీర్ ఏజెంట్ ( భీమా సఖి ) గా ఎంపిక అయ్యేందుకు అనర్హులు.

🔥దరఖాస్తు విధానం :

  • ఆసక్తి మరియు అర్హత కలిగి ఉన్న మహిళలు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో బీమా సఖి గా నియామకం పొందేందుకు గాను దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు చేసుకొనేందుకు గాను ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేసి , ప్రాధమిక వివరాలు అనగా పేరు పేరు , డేట్ ఆఫ్ బర్త్ , ఫోన్ నెంబర్ , ఇమెయిల్ ఐడి , అడ్రస్ మరియు పిన్ కోడ్ వంటివి నమోదు చేయాలి.
  • తర్వాత రాష్ట్రం మరియు సిటీ ను ఎంపిక చేసుకొని , ఏ బ్రాంచ్ లలో పనిచేయాలి అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ లను ( కనీసం ఒకటి , గరిష్టంగా 3 బ్రాంచ్ ) ఎంపిక చేసి సబ్మిట్ చేయాలి.
  • సబ్మిట్ అయిన తర్వాత సంస్థ యొక్క అధికారులే దరఖాస్తు దారులను కాంటాక్ట్ చేస్తారు.

🔥 దరఖాస్తు కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :

  • ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • స్వీయ ధృవీకరణ చేసిన ఏజ్ ప్రూఫ్ కాపీ
  • స్వీయ ధృవీకరణ చేసిన అడ్రస్ ప్రూఫ్ కాపీ
  • స్వీయ ధృవీకరణ చేసిన విద్యార్హత సర్టిఫికెట్ కాపీ

🔥 లభించే స్టైఫండ్ :

భీమా సఖి గా ఎంపిక అయిన వారికి నెలవారి స్టైఫండ్ లభిస్తుంది. వీటికి అదనంగా బోనస్ లు మరియు కమిషన్ లు కూడా లభిస్తాయి

  • మొదటి సంవత్సరం నెలకు 7,000 రూపాయలు చొప్పున లభిస్తుంది.
  • రెండవ సంవత్సరం నెలకు 6,000 రూపాయలు చొప్పున స్టైఫండ్ అందచేస్తారు.
  • మూడవ సంవత్సరం నెలకు 5,000 రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు.

👉 Click here for Job advertisement details

👉 Click here to apply bhima sakhi

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *