దేశంలో బ్యాంకింగ్ రంగం బాగా అభివృద్ధి చెందింది. అన్ని బ్యాంకులు తమ కార్యకలాపాలు విస్తరించడంతో పాటు అనేక బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నాయి.
పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు (Latest Bank jobs Notifications) కూడా బ్యాంకులు చేపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది సిబ్బందిని ప్రభుత్వ రంగ బ్యాంకులు నియమించుకోబోతున్నాయి.
50,000 ఉద్యోగాలను ఏ బ్యాంకులు భర్తీ చేస్తాయి :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వివిధ 12 ప్రభుత్వ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
ప్రభుత్వ బ్యాంకులు భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
భర్తీ చేయబోయే 50,000 ఉద్యోగాల్లో 21,000 ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు క్లర్క్, అటెండర్ వంటి ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500 పోస్టులు , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 పోస్టులు భర్తీ చేయనున్నారు.
బ్యాంక్ ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలు :
బ్యాంక్ ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.
50,000 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు :
50,000 బ్యాంక్ ఉద్యోగాలను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే భర్తీ చేయనున్నారు.