భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధి లోగల డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ ( IPPB ) నుండి గ్రామీణ డాక్ సేవక్ లను ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 348 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? ఏ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి ? వంటి వివరాల పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- IPPB ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- దేశవ్యాప్తంగా మొత్తం 348 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లో 08 & తెలంగాణ లో 09 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 విద్యార్హతలు :
- భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగం నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 దరఖాస్తు విధానం :
- గ్రామీణ డాక్ సేవక్ లుగా పనిచేస్తూ , ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కొరకు ఆసక్తి మరియు అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 29/10/2025 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది , 750 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 30,000 రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 09/10/2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 29/10/2025
👉 Click here for official website