IOCL Engineer Recruitment 2025 : భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మరియు నాచురల్ గ్యాస్ పరిధిలో గల మల్టీనేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంస్థ నుండి ఇంజనీర్స్ / ఆఫీసర్స్ గ్రేడ్ – A ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా కెమికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు కి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
✅ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు భర్తీ – Click here
Table of Contents
🔥 IOCL Engineer Notification విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఇంజనీర్ / ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- సుమారుగా 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
🔥 వయోపరిమితి :
- 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రభుత్వ నియమ నిబంధన మేరకు వయోసడలింపు లభిస్తుంది.
🔥 అవసరమగు విద్యార్హత :
- గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాలలో (కెమికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) విభాగాలలో బిఈ లేదా బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విద్యార్హతలు జనరల్ , ఈ డబ్ల్యూ ఎస్ , ఓ బి సి నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు కనీసం 65% మార్కులు & ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు కనీసం 55% మార్కులు పొంది ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో ఈ ఉద్యోగం నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష , గ్రూప్ డిస్కషన్ & గ్రూప్ టాస్క్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ బేసిక్ పరీక్షకు 85 శాతం వెయిటేజ్ , గ్రూప్ డిస్కషన్ మరియు గ్రూప్ టాస్క్ కు 5 శాతం వెయిటేజ్ , పర్సనల్ ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజ్ నిర్ణయించారు.
🔥 పరీక్ష విధానం :
- కంప్యూటర్ ఆధారిత రత పరీక్షలు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 50 ప్రశ్నలు సంబంధిత విభాగానికి చెందిన ప్రశ్నలు కాగా , జనరల్ ఆప్టిట్యూడ్ లో భాగంగా క్వాంటిటీ టు ఆటిట్యూడ్ 20 ప్రశ్నలు , లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలు , వెర్బల్ ఎబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 ప్రశ్నలు వుంటాయి.
- పరీక్ష 15 నిమిషాలు కొనసాగుతుంది. తప్పుగా సమాధానం గుర్తిస్తే 1/4 వంతు రుణాత్మక మార్కింగ్ విధానం కలదు .
🔥 పరీక్షా కేంద్రాలు :
- దేశంలోని ప్రముఖ నగరాలలో పరీక్ష నిర్వహిస్తారు.
- తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం , విజయవాడ / గుంటూరు , తిరుపతి, రాజమండ్రి నందు మరియు తెలంగాణలో హైదరాబాద్ , వరంగల్ నందు పరీక్ష నిర్వహిస్తున్నారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 05/09/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21/09/2025
- అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ : 17/10/2025
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ తేదీ : 31/10/2025