గుడ్లు మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఆహార పదార్థాలలో ఒకటి. ఆరోగ్యకరమైన ఆహారం కావడంతో పాటు, ఖర్చు తక్కువగా ఉండటంతో ప్రతీ వయస్సు వారు గుడ్లను వాడతారు. డాక్టర్లు కూడా పౌష్టికాహారం కోసం గుడ్లు తినాలి అని చెబుతూ ఉంటారు. అందుకే గుడ్ల హోల్ సేల్ వ్యాపారం (Wholesale Egg Business) మంచి లాభదాయకమైన వ్యాపార అవకాశంగా మారుతోంది. మీలో చాలామందికి ఈ వ్యాపారం చేయాలి అని ఉంటుంది. కానీ ఈ వ్యాపారం ఎలా చేయాలి ? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? ఎంత పెట్టుబడి అవసరం అనే వివరాలు తెలియక వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారు కదా ?
ఈ ఆర్టికల్ చదవడం ద్వారా మీరు గుడ్ల హోల్ సేల్ వ్యాపారం ఎలా ప్రారంభించాలో, అవసరమైన అనుమతులు, పెట్టుబడి, లాభాలు తదితర వివరాలు తెలుసుకుంటారు. మంచి ప్రణాళికతో ఈ బిజినెస్ మీరు ప్రారంభిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి లాభాలు పొందుతారు.
✅ వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి. మీ నెంబర్ ఎవరికీ కనిపించదు
1. Wholesale Egg Business వ్యాపార తత్వం అర్థం చేసుకోండి :
గుడ్ల హోల్ సేల్ వ్యాపారంలో మీరు ఉత్పత్తిదారుల (పోల్ట్రీ ఫార్మ్స్) నుంచి గుడ్లను భారీగా కొనుగోలు చేసి, రిటైలర్లకు లేదా బేకరీలకు, హోటళ్లకు సరఫరా చేస్తారు. మీరు మధ్యవర్తిగా పని చేస్తారు. ఇలా పని చేయడం వల్ల మీరు వ్యాపార తత్త్వం అర్దం చేసుకోవచ్చు.
2. Wholesale Egg Business Market Research (మార్కెట్ పరిశోధన)
- మీ ప్రాంతంలో గుడ్లకు డిమాండ్ ఎలా ఉంది?
- పోటీదారులు ఎవరు?
- హోటల్స్, క్యాంటీన్లు, గృహ అవసరాలు ఎంత ఉన్నాయి?
- ఈ విషయాలపై ముందుగా సమాచారం సేకరించండి.
3. Wholesale Egg Business Registration and Approvals (వ్యాపార రిజిస్ట్రేషన్ & అనుమతులు)
ఈ వ్యాపారానికి చట్టబద్ధత ఇవ్వాలంటే కొన్ని ముఖ్యమైన అనుమతులు అవసరం , అవి వరుసగా
1) GST రిజిస్ట్రేషన్
2) వ్యాపార లైసెన్స్ (Municipality / Gram Panchayat నుంచి పొందాలి)
3) FSSAI ఫుడ్ లైసెన్స్ – ఆహార సరఫరా సంబంధం ఉన్నందున ఈ లైసెన్స్ అవసరం అవుతుంది.
4. Wholesale Egg Business సరఫరాదారులను ఎంచుకోవడం :
మీకు మంచి నాణ్యత గల గుడ్లు సరఫరా చేసే పోల్ట్రీ ఫార్మ్స్ లేదా డీలర్లను కనుగొనండి. ధర, నాణ్యత, సరఫరా వేగం , ఇవన్నీ పరిశీలించి వారితో ఒప్పందం చేసుకోండి.
5. Wholesale Egg Business నిల్వ మరియు ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు :
గుడ్లు సులభంగా పాడయ్యే పదార్థం కనుక నిల్వకు తగిన పద్ధతులు ఉండాలి :
1) తేమ తక్కువగా ఉండే గిడ్డంగి ఏర్పాటు చేసుకోండి.
2) గుడ్లు పగలకుండా ఉండేందుకు ఎగ్ ట్రేలు సిద్ధం చేసుకోవాలి.
3) సరఫరా కోసం చిన్న ట్రక్ లేదా ఆటో కూడా మీ దగ్గర ఉండాలి.
6. Wholesale Egg Business పెట్టుబడి మరియు లాభాలు
గుడ్లు హోల్ సేల్ వ్యాపారానికి ప్రారంభ పెట్టుబడి ₹50,000 – ₹2 లక్షల వరకు ఉండవచ్చు. (స్థలం, వాహనం, నిల్వ, మొదటిసారి కొనుగోలు కోసం ఈ ఖర్చు అవుతుంది)
- ఒక్కో గుడ్డు పై ₹0.50 – ₹1 వరకు మీకు లాభం వస్తుంది.
- రోజుకు 1000 గుడ్లు అమ్మినట్లయితే నెలకు ₹25,000 వరకు లాభం పొందవచ్చు
7. Wholesale Egg Business మార్కెటింగ్ మరియు కస్టమర్ల పెంపుదల :
ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలకు విపరీతమైన పోటీ ఉంది. కాబట్టి మీరు తప్పకుండా బాగా మార్కెటింగ్ చేయడం తప్పనిసరి.
- హోటళ్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు టార్గెట్ చేయండి.
- WhatsApp గ్రూప్స్, Facebook మార్కెటింగ్ ద్వారా ప్రచారం చేయండి.
- డిస్కౌంట్ ఆఫర్లు, వేగవంతమైన డెలివరీలతో విశ్వాసం పొందండి.
- డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించి కూడా మీరు సేల్స్ పెంచుకోవచ్చు.
8. Wholesale Egg Business Risk Factors :
- ధరల్లో తేడాలు , నిల్వ సమస్యలు , ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇలాంటివి అన్ని ముందుగానే అంచనా వేసుకుని వ్యాపారం నిర్వహించాలి.
- తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారం ప్రారంభించి , మీ సేల్స్ బట్టి నెమ్మదిగా వ్యాపారం పెంచుకోండి. అనవసర ఖర్చులు పెట్టుకోవద్దు.