రైతులకు శుభవార్త ! కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది.. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాని , పీఎం కిసాన్ 20వ విడత నిధులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన పీఎం కిషన్ 20వ విడత నిధులు ప్రతి రైతు అకౌంట్లో ₹2000 చొప్పున జమ చేశారు. ఈ ఆర్టికల్ మీరు చివరి వరకు చదివి మీ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది తప్పకుండా తెలుసుకోండి..
Table of Contents
PM Kisan 20వ విడత నిధులు జమ :
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో పీఎం కిసాన్ పథకానికి అర్హత ఉన్న 9.7 కోట్ల మంది రైతుల అకౌంట్లో 20,500 కోట్ల నిధులు జమ చేశారు. 2024 సంవత్సరంలో పీఎం కిసాన్ 19వ విడత నిధులు బీహార్ రాష్ట్రంలో ప్రధాని పర్యటించిన సందర్భంలో విడుదల చేయడం జరిగింది.
✅ 46.86 లక్షల మంది రైతుల అకౌంట్ లో అన్నదాత సుఖీభవ నిధులు జమ – Click here
PM Kisan Scheme నిధులు ఎవరి అకౌంట్లో జమ చేశారు ?
ఈ కేవైసీ పూర్తి చేసుకున్న అర్హత ఉన్న రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ పథకం నిధులను జమ చేయడం జరిగింది. ఈ కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు అవకాశం కూడా ఇచ్చింది. రైతులు ఈ కేవైసీ ను పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి ఓటిపి ఆధారంగా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా దగ్గర్లో ఉన్న రైతు సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్స్ లో కూడా బయోమెట్రిక్ ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
PM Kisan Samman Nidhi పథకం డబ్బులు మీ అకౌంట్లో జమ చేశారా లేదా ఇలా తెలుసుకోండి :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన 20వ విడత నిధులు మీ అకౌంట్లో జమ అయ్యాయా లేదా అనేది మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్లో Know Your Status అనే లింకు పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి మీ అకౌంట్లో డబ్బులు జమ చేశారా లేదా అనే స్టేటస్ తెలుసుకోవచ్చు.
డ✅ Know Your Status – Click here
✅ Official Website – Click here