డిజిపిన్ అంటే ఏమిటి ? | పూర్తి అడ్రస్ చెప్పకుండా డిజిపిన్ చెప్తే చాలు | What is DIGIPIN

DIGIPIN అంటే ఏమిటి ? - డిజిపిన్
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

అడ్రస్ ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక అంశంగా ఉంది. మీ అడ్రస్ లో పిన్ కోడ్ అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు మీ అడ్రస్ కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కొరియర్ మీ ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు. మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం కొరియర్ బాయ్ మీ ఇంటికి రాలేకపోవచ్చు. మీరు ఎవరికైనా అడ్రస్ చెప్పేటప్పుడు మీ ఊరి పేరు, ఇంటి నెంబరు, పిన్ కోడ్, మండలము, జిల్లా, రాష్ట్రము అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వాలి కదా. కానీ ఇకపై అలా అవసరం లేదు. దీనికోసం పోస్టల్ డిపార్ట్మెంట్ సరికొత్త విధానం తీసుకొస్తుంది. అదే డిజిపిన్

ఈ సోషల్ మీడియా యుగంలో అన్నీ కూడా సింపుల్ గా వుండాల్సి వస్తుంది. ఇంటి నంబరు , అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ కుదించి ఒక్క నెంబర్ తో పూర్తి అడ్రస్ తెలుసుకునేలా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు DIGIPIN ను ఏర్పాటు చేస్తుంది.

DIGIPIN అంటే ఏమిటి ? ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్న అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోగలరు.

🏹 అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు అకౌంట్ లో వేస్తారో తెలుసా – Click here

🔥డిజిటల్ యుగంలో డిజిపిన్ (DIGIPIN) :

  • ఒకే ఒక్క పది అంకెల / అక్షరాల నెంబర్ తో వ్యక్తి అడ్రస్ తెలుసుకునేలా DIGIPIN వ్యవస్థ ను పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేస్తున్నారు.
  • గతంలో చిరునామా అనగా ఇంటి నంబర్, వీధి / కాలనీ , మండలం, జిల్లా, రాష్ట్రం ఇవన్నీ ప్రస్తావించాలి. ఇక నుండి ఇవన్నీ అవసరం లేకుండా డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ (DIGIPIN) ద్వారా సులభంగా అడ్రస్ ను ప్రస్తావించనున్నారు.
  • రానున్న రోజులలో మొత్తం చిరునామా కి బదులుగా ఈ నెంబర్ రాస్తే సరిపోతుంది.
  • ఇందుకు గాను పోస్టల్ డిపార్ట్మెంట్ వారు చిరునామా వ్యవస్థను అధునాతనంగా రూపొందిస్తున్నారు.

🔥డిజిపిన్ (DIGIPIN) ను ఏ విధంగా రూపొందిస్తారు ?

  • ముందుగా మన దేశం యొక్క భౌగోళిక ప్రాంతాన్ని సాఫ్ట్వేర్ ఆధారంగా తొలుత ఏకరితిగా (Uniformly) గ్రిడ్ లుగా విభజిస్తారు.
  • అక్షాoశాలు మరియు రేఖాంశాలు ఆధారంగా ఆ గ్రీడ్ లు పది దశలుగా వుంటాయి.
  • ఆ తర్వాత చివరిగా మన యొక్క చిరునామా పై డిజి పిన్ ను ఏర్పాటు చేస్తారు.
  • ఆ డిజి పిన్ ఉపయోగించి పోస్టల్ కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
  • ఐఐటీ – హైదరాబాద్ వారి సహకారం తో జియో కోడెడ్ , గ్రిడ్ ఆధారంగా ఈ వ్యవస్థను పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అభివృద్ధి చేస్తున్నారు.
  • ప్రకృతి వైపరీత్యాలు , వరదలు వచ్చిన సమయంలో ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ఆ కోడ్ ను ఉపయోగించి ప్రజలను రక్షించవచ్చు.

Know Your DIGIPIN – Click here

Note :

DIGIPIN కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి..

Visit Postal Department Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *