నిరుద్యోగులకు , 30 సంవత్సరాల లోపు గల యువతకు ఒక మంచి శుభవార్త ! స్కాలర్షిప్ పరీక్ష (Free scholarship test) రాసి 50,000/-రూపాయలు వరకు పొందేందుకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. పరీక్ష రాసిన వారిలో పాస్ అయిన మొదటి 150 మందికి 10,000/- నుండి 50,000/- వరకు రూపాయలు వరకు ఇవ్వనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం లో గల రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంస్థ ” ఆర్య జననీ ట్రస్ట్ ” (Non profit Organization ) సంస్థ ప్రతీ సంవత్సరం కూడా విద్యార్థులకు & నిరుద్యోగులకు ఆధ్యాత్మికత పెంపొందించేలా స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంత్ ( Knowledge is strength) అనే పేరుతో స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తుంది.
ఈ స్కాలర్షిప్ పరీక్ష లో విజయం సాధిస్తే గరిష్టంగా 50,000 /-రూపాయలు వరకు బహుమతి లభిస్తుంది.
ఈ స్కాలర్ షిప్ పరీక్ష కు సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our Telegram Group – Click here
🔥 ఆన్లైన్ స్కాలర్షిప్ పరీక్ష (Free scholarship test) రాయండి – 50 వేలు పొందండి :
- హైదరాబాద్ లో గల రామకృష్ణా మఠం ఆధ్వర్యంలో గల ఆర్య జననీ సంస్థ “నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంత్” అనే పేరుతో ఆన్లైన్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహిస్తుంది.
- యువత లో ఆధ్యాత్మిక పెంపొందించేందుకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- ఇది జాతీయ స్థాయి స్కాలర్ షిప్ పరీక్ష, ఈ పరీక్ష రాసి తమ విజ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు మరియు ఆర్థిక లబ్ది పొందవచ్చు.
- గరిష్ఠంగా 50,000/-రూపాయలు బహుమతి పొందవచ్చు.
✅ ఇంటర్ పాస్ అయిన వారికి 20,000/- స్కాలర్షిప్ – Click here
🔥 వయస్సు మరియు ఇతర అర్హతలు :
- 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు లోపు వయస్సు గల వారు ఈ ఆన్లైన్ స్కాలర్ షిప్ పరీక్ష ను రాయవచ్చు.
🔥 స్కాలర్ షిప్ పరీక్ష (Free scholarship) test విధి విధానాలు :
- స్కాలర్ షిప్ పరీక్ష ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహిస్తారు.
- ఆగస్టు 3వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 – 6 మధ్య ఈ పరీక్ష నిర్వహణ వుంటుంది. జూలై 20 వ తేదీన మాక్ టెస్ట్ నిర్వహిస్తారు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఇది పూర్తిగా ఉచితం.
- ఈ స్కాలర్ షిప్ పరీక్ష లో నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు. 1/4 వ వంతు (0.25 మార్కులు ) నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
- ఈ పరీక్షా లో భాగంగా స్వామి వివేకానంద బోధనలు పైన ప్రశ్నలు వుంటాయి. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ పుస్తకాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.
- అభ్యర్థులు రిజిస్టర్ అయ్యేందుకు గాను మరియు ఇతర సమాచారం కొరకు అధికారిక వెబ్సైట్ ను లేదా 8977863881 ను సంప్రదించాలి.