నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ , స్టైఫండ్ కూడా ఇస్తారు | Free Coaching For Unemployed Candidate’s

Free Coaching
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్రంలో గల నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ (Free Coaching) ఇచ్చి, 5,000/- రూపాయలు స్టైఫండ్ ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల బీసీ స్టడీ సర్కిల్స్ నుండి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన జారీ చేశారు.

అలానే రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కూడా అధికారిక ఉచిత కోచింగ్ కొరకు అధికారిక ప్రకటన చేశారు.

ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

Join Our What’sApp Group – Click here

🔥నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ & 5000/- స్టైఫండ్ (Free Coaching for Unemployed Candidate’s) :

  • తెలంగాణ రాష్ట్రంలో గల ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ నుండి కీలక ప్రకటన విడుదల అయ్యింది.
  • కరీంనగర్ జిలా బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు గ్రూప్ -1 , గ్రూప్ – 2, గ్రూప్ -3 , గ్రూప్ -4 మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) పరీక్షలు , స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), బ్యాంకింగ్ వంటి అన్ని పోటీ పరీక్షలు కు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.
  • మొత్తం 5 నెలల కాలపరిమితి లో ఈ కోచింగ్ ను పూర్తి చేస్తారు.
  • ఇందుకు గాను విద్యార్థులకు ప్రతీ నెల 1000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది. అనగా 5 నెలలకు గాను 5000 రూపాయలు స్టైఫండ్ రూపంలో అందజేస్తారు.

🔥 ఎవరు అర్హులు ? & ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? :

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు అనగా ప్రస్తుత జగిత్యాల , పెద్దపల్లి , కరీంనగర్ జిల్లా లో గల వారు ఈ ఉచిత కోచింగ్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు .
  • జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 11 వరకు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు జూలై 16 నుండి ఆగస్టు 08 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే కరీంనగర్ వారు : 0878-2268686 ను , రాజన్న సిరిసిల్ల వారు : 08723 223004 , 9381888746 ను సంప్రదించవచ్చు.
  • ఈ ఉచిత కోచింగ్ వలన అభ్యర్థులు క్రమబద్ధంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాబోవు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి అవకాశం లభిస్తుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *