EMRS Staff Nurse Vacancy 2025 : ది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సంస్థ నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( EMRS ) లో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా మొత్తం 7267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఇందులో భాగంగా 550 ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరం విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏమిటి? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్లో చివరి వరకు చదవగలరు.
✅ నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 EMRS Staff Nurse నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 EMRS Staff Nurse నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అవసరమగు విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి నర్సింగ్ విభాగంలో బిఎస్సి ( హానర్స్ ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ( లేదా )
- గుర్తింపు పొందిన సంస్థ నుండి బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
- ( లేదా )
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
- ( మరియు )
- ఏదైనా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నుండి నర్స్ లేదా నర్స్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ కాబడి ఉండాలి .
- కనీసం రెండున్నర సంవత్సరాల పాటు 50 పడకల ఆసుపత్రి నందు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

🔥 వయోపరిమితి :
- 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థుల కు 3 సంవత్సరాలు మరియు ఇతర వర్గాల వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయోసడలింపు లభిస్తుంది.
🔥 దరఖాస్తు విధానము :
- ఉద్యోగలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టి , దివ్యాంగులు , మహిళ అభ్యర్థులు 500 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
- మిగతా అందరు అభ్యర్థులు వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజ్ తో పాటుగా 500 రూపాయలు ప్రోసెసింగ్ ఫీజు మొత్తం 1500 రూపాయలు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానము :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించి , అందులో మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. 1/3 వంతు మార్కింగ్ విధానం కలదు.

🔥 లభించే జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి లెవెల్ – 05 ప్రకారం బేసిక్ పే 29,200 నుండి 92,300 వరకు గల పే స్కేల్ తో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23/10/2025 ( రాత్రి 11:30 లోపుగా )
