ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ECIL Hyderabad Recruitment 2025 | Latest jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో గల ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్టు ఇంజనీర్ , టెక్నికల్ ఇంజనీర్ , అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు ఒక సంవత్సరాల కాలానికి గాను రిక్రూట్ చేయబడినప్పటికి ప్రాజెక్టు అవసరాల బట్టి & అభ్యర్థి యొక్క పనితనం బట్టి 4 సంవత్సరాల వరకు కొనసాగించబడతారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాలు

  • 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ – 01
  • టెక్నికల్ ఆఫీసర్ – 03
  • అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ – 03 

🔥 విద్యార్హత :

  1. ప్రాజెక్టు ఇంజనీర్ / టెక్నికల్ ఆఫీసర్:
    1. గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబండితవిభాగంలో  కనీసం  60 శాతం మార్కులతో బి . ఈ / బి టెక్ పూర్తి చేసి వుండాలి.
    2. ప్రాజెక్టు ఇంజనీర్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 3 సంవత్సరాల అనుభవం అవసరం.
    3. టెక్నికల్ ఆఫీసర్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 1 సంవత్సరం అనుభవం అవసరం.

       2.అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్:

  • సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి , ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారికి 33 సంవత్సరాలు & టెక్నికల్ ఆఫీసర్ , అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్  కి దరఖాస్తు చేసుకొనే వారికి 30 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు గా నిర్ణయించారు.
  • ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు &  ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు & PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 జీతం :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ : మొదటి సంవత్సరం నెలకు 40,000/- రూపాయలు నుండి ప్రారంభం అయి 4 వ సంవత్సరం 55,000/- రూపాయలకు చేరుతుంది. (సంవత్సరానికి 5,000/- చొప్పున పెరుగుతుంది)
  • టెక్నికల్ ఆఫీసర్ : మొదటి సంవత్సరం నెలకు 25,000/- రూపాయలు నుండి ప్రారంభం అయి 3 , 4 వ సంవత్సరం 31,000/- రూపాయలకు చేరుతుంది. ( సంవత్సరానికి 3,000/- చొప్పున పెరుగుతుంది)
  • అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్: నెలకు 24,804/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు వారి క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిట్ ఏజ్ ఇస్తారు 
  • సంబంధిత విభాగంలో పని అనుభవం నకు 30 శాతం వెయిటేజి ఇస్తారు.
  • పర్సనల్ ఇంటర్వ్యూకి 50 శాతం వెయిటేజి ఇస్తారు.

🔥 ఇంటర్వ్యూ  నిర్వహించి కేంద్రం మరియు తేది :  

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని , దరఖాస్తు ను ఫీల్ చేసి  ఇంటర్వ్యూ నిర్వహణ తేది 26/03/2025 (బుధవారం ) నాడు సంబంధిత ఇంటర్వ్యూ కేంద్రానికి ఉదయం 9:00 గంటలకు హాజరు కావాలి.
  • Corporate Learning & Development Centre, Nalanda Complex, Electronics Corporation of India Limited, TIFR Road, ECIL Post, Hyderabad, 500062 వద్ద రిపోర్ట్ చేయాలి.
  • ఇంటర్వ్యూ కి హాజరు అయినప్పుడు క్రింది డాక్యుమెంట్స్ ను తీసుకొని వెళ్ళాలి.

🔥 అవసరమగు ధృవపత్రాలు :

  • 10వ తరగతి సర్టిఫికెట్
  • బి.ఈ / బి.టెక్ లేదా డిప్లొమా అర్హత కి సంబంధించిన సర్టిఫికెట్లు మరియు మార్క్స్ షీట్లు
  • ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ లేదా పాస్పోర్ట్ ( దృవీకరణ కోసం )
  • పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు
  • ఇతర సర్టిఫికెట్లు
  • ఇంటర్వ్యూ తేది నాడు రిజిస్ట్రేషన్ ఉదయం 11:30 నిముషాలకి క్లోజ్ అవుతుంది.

🔥 ముఖ్యమైన తేది :

  • పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించు తేది: 26/03/2025

👉  Click here for notification 
👉 Click here for official

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *