DSSSB TGT Recruitment 2025 : ఢిల్లీ సభార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు డ్రాయింగ్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటితోపాటు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 9వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఉద్యోగాలు ఎంపికలో 200 మార్కులకు పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు కలిగిన 30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఇస్తారు. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు అదనంగా మరో 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఇస్తారు.
జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 100/- రూపాయలు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపికైన వారికి లెవెల్ 7 ప్రకారం 44,900/- నుండి 1,42,400/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి..
✅ Download Notification – Click here
