DSC పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ విషయాలను మిస్ కాకండి | AP Mega DSC Important Instructions | AP DSC Hall Tickets 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రాష్ట్రంలో మెగా DSC పరీక్షల నిర్వహణ కి అంతా సిద్ధం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 154 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు.

మెగా DSC పరీక్షల నిమిత్తం DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు పలు విషయాలను ప్రకటించారు.

ఇందులో భాగంగా అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చిన అనుమతి లభించదు అని , అలానే హాల్ టికెట్ లో వున్న తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించామని తెలియచేశారు.

మెగా DSC పరీక్ష రాసే అభ్యర్థుల యొక్క సౌకర్యార్థం ఈ ఆర్టికల్ లో పలు సూచనలు తెలియచేయడం జరిగింది.

అభ్యర్థులు తప్పనిసరిగా వీటిని పాటించగలరు.

🔥మెగా DSC పరీక్ష కి నిముషం ఆలస్యమైనా అనుమతించరు :

  • ప్రస్తుతం ఆన్లైన్ విధానం ద్వారా DSC పరీక్షలను నిర్వహిస్తున్నారు.
  • జూన్ 06 నుండి ప్రారంభం అయ్యే ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 154 కేంద్రాలలో నిర్వహించేదుకు గాను విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
  • ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించే ఈ మెగా DSC పరీక్షలకు ఒక్క నిముషం ఆలస్యం అయినా అనుమతించేది లేదు అని DSC కన్వీనర్ వెంకట కృష్ణా రెడ్డి ప్రకటించారు.
  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 90 నిముషాల ముందే చేరుకోవాలి అని ఆయన సూచించారు.
  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు గుర్తించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు…అలానే వేసవి ఎండలు ను దృష్టిలో ఉంచుకొని , పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

🔥 మెగా డీఎస్సీ హాల్ టికెట్లలో తప్పులను సరిచెయుటకు గుర్తింపు కార్డులు వుండాలి :

  • అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ లలో తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డ్ లను పరీక్షా కేంద్రాల వద్ద ఇస్తే హాల్ టికెట్ నుంసవరిస్తామని తెలియచేసారు.
  • హాల్ టికెట్ లో తల్లిదండ్రుల పేర్లు , కులం , పుట్టిన తేదీ లో తప్పులు ఉంటే సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలి.
  • హాల్ టికెట్ లో ఫోటో లేకపోతే అభ్యర్థులు రెండు ఫోటోలతో పాటు ఆధార్, పాన్ కార్డు , ఓటర్ ఐడి వంటి ధ్రువ పత్రాలు కూడా తీసుకొని రావాల్సి వుంటుంది.

🔥 మెగా డీఎస్సీ అభ్యర్థులకు సాంకేతిక సహకారం :

  • పరీక్ష రాసే సమయం లో అభ్యర్థులకు సాంకేతికంగా సహకారం అందజేస్తామని , పరీక్షా కేంద్రాలలో ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు అందుబాటులో ఉంటారు.
  • పరీక్షా సమయంలో అభ్యర్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వీరి సహకారం తీసుకోవచ్చు. పరీక్షా సమయంలో కంప్యూటర్ లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వీరు సరి చేస్తారు.

🔥దివ్యాంగులకు అన్ని విధాలా సహకారం :

  • దివ్యాంగులు వారికి పరీక్ష కొరకు అన్ని అంశాలలో సహాయసహకారాలు అందచేయనున్నారు.
  • దృష్టి లోపం ఉన్న వారు మరియు రెండు చేతులు లేని వారు కి పరీక్ష రాసేందుకు గాను 10 వ తరగతి విద్యార్థులను సహాయకులు గా ఏర్పాటు చేస్తారు.
  • స్క్రైబ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రైబ్ లను ఏర్పాటు చేస్తారు. మొత్తం 1300 మంది స్క్రైబ్ కొరకు కోరుతున్నారు.
  • స్క్రైబ్ కొరకు దరఖాస్తులో ఆప్షన్ ఇవ్వనప్పటికీ అవసరమైతే DEO గారి అనుమతి తో స్క్రైబ్ ప్రొవైడ్ చేస్తామని తెలియచేసారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *