డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలు భర్తీ | DRDO Jobs

DRDO Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

DRDO Recruitment 2025 : భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) సంస్థ నుండి వివిధ ఉద్యోగ భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 561 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B ( STA – B ) ఉద్యోగాలను మరియు 203 టెక్నీషియన్ – A ( Tech – A) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? మొదలగు అన్ని అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B ( STA – B ) మరియు టెక్నీషియన్ – A ( Tech – A) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 764 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B ( STA – B ) – 561
  • టెక్నీషియన్ – A ( Tech – A) – 203

🔥 అవసరమగు విద్యార్హతలు :

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B ( STA – B ) : ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత విభాగాలలో డిప్లొమా ( కెమిస్ట్రీ , జియోలజీ , లైబ్రరీ సైన్స్ , మాథెమాటిక్స్, ఫిజిక్స్ విభాగాల వారు డిగ్రీ ఉత్తీర్ణత ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • టెక్నీషియన్ – A : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి.

🔥 వయో పరిమితి :

  • 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు పది సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.

🔥 దరఖాస్తు చేయు విధానము :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంది.
  • మహిళలు , ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఇతర అభ్యర్థులు 750 రూపాయలు మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఇతర అభ్యర్థులు 600 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • మొత్తం దరఖాస్తు ఫీజులు 500 రూపాయలు రీఫండ్ చేయబడుతుంది.

🔥 ఎంపిక విధానము :

  • దరఖాస్తు చేయి అభ్యర్థులు కు టైర్ – 01 , టైర్ – 02 వ్రాత పరీక్షలు మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • దేశంలో ప్రముఖ నగరాలతో పాటుగా తెలుగు రాష్ట్రాలలో గల అమరావతి , హైదరాబాద్ , విశాఖపట్నం , తిరుపతి , విజయవాడ , వరంగల్ వంటి నగరాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు.

🔥 జీతభత్యాలు :

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – B గా ఎంపిక అయిన వారికి పే లెవెల్ 06 ప్రకారం 35,400/ – 11240/- రూపాయలు పే స్కేల్ వర్తిస్తుంది.
  • టెక్నీషియన్ – A గా ఎంపిక అయిన వారికి 19,900/- నుండి 63,200/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 11/12/2025.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 01/01/2026.
  • అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేదీ : 01/01/2026.
  • ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 03/01/2026.

👉 Click here to apply

👉 Click here to Download Official notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *