DSC పరీక్షలకు కొత్త హాల్ టికెట్స్ విడుదల | AP DSC Exams New Hall Tickets Download | July 1st , 2nd AP DSC Hall Tickets

AP DSC Hall Tickets 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కారణంగా వాయిదా పడిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు (AP DSC Hall Tickets) ను అధికారిక వెబ్సైట్ లో ఈ రోజు నుండి అందుబాటులో ఉంచారు.

వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి జూలై 01 , జూలై 02 వ తేదీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

🔥వాయిదా పడిన DSC పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదల : ( AP DSC Hall Tickets)

  • రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూన్ 21 వ తేదీన యోగాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమమునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా హాజరు అయ్యారు.
  • ఈ కార్యక్రమం వలన ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడి , DSC అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి అన్న ఉద్దేశ్యంతో DSC బోర్డు వారు జూన్ 20 మరియు జూన్ 21 వ తేదీన నిర్వహించవలసిన DSC పరీక్షలను వాయిదా వేశారు.
  • ఈ పరీక్షలను జూలై 01 మరియు జూలై 02 వ తేదీలలో నిర్వహించనున్నామని గతంలోనే తెలియచేశారు.
  • ఇందుకు సంబంధించి వాయిదా పడిన DSC పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ రోజు విడుదల చేస్తున్నారు.
  • అభ్యర్థులు జూలై 01 మరియు జూలై 02 న నిర్వహించే పరీక్ష కి సంబంధించి అధికారిక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొని , పరీక్షా కేంద్రాలను సరిచూసుకోవాలి అని , పరీక్షా కేంద్రాలను నిర్ధారణ చేసుకొని పరీక్షకు హాజరు కావాలి అని DSC కన్వీనర్ వెంకట కృష్ణా రెడ్డి గారు అభ్యర్థులకు సూచించారు.

How to Download AP DSC Hall Tickets :

👉 Click here to Download Hall tickets

  • DSC Hall Tickets డౌన్లోడ్ చేయడానికి ముందుగా పైన ఇచ్చిన లింకుపై క్లిక్ చేయండి.
  • తరువాత క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ , CAPTCHA వివరాలు సరిగ్గా నమోదు చేసి Sign in పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు వెబ్సైట్ లో ఎడమవైపున సర్వీసెస్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ కనిపిస్తుంది.
  • హాల్ టికెట్ ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా అభ్యర్థులు తమ కొత్త హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయవచ్చు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!