సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS Recruitment 2025) అనే సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, MD/MS మరియు నర్సింగ్, లేబరేటరీ టెక్నీషియన్, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
✅ Join Our Telegram Group – Click here
ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, స్టాఫ్ నర్స్, లైబ్రరీ క్లర్క్, సెక్యూరిటీ ఇంచార్జ్, రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ), అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాలజి), రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, ఫార్మసిస్ట్, అటెండెంట్, డ్రైవర్, లేబరేటరీ అటెండెంట్, రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద) , మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, ఆఫ్సెట్ మిషన్ ఆపరేటర్ అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి కనీసం 27 సంవత్సరాల నుంచి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది.
పైన తెలిపిన ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి. సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అప్లికేషన్ లో తప్పులు ఉంటే మార్పులు చేయవచ్చు…
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here