BSF Head Constable Notification 2025 : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు నుండి హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 23వ తేదీ లోపు అప్లై చేయాలి. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ డిగ్రీ అర్హతతో LIC లో ఉద్యోగాలు – Click here
Table of Contents
BSF Head Constable Recruitment 2025 :
BSF Head Constable Total Vacancies :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1121 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
BSF Head Constable Qualification :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ , మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. లేదా పదో తరగతి తర్వాత సంబంధిత విభాగంలో ఐటి పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే.
BSF Head Constable Age Details :
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు
వయసులో సడలింపు వివరాలు :
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 24వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 23వ తేదీ లోపు అప్లై చేయాలి.
జీతము పే స్కేల్ వివరాలు :
- 25,500/- నుండి 81,100/- వరకు జీతము ఇస్తారు..
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఎస్సీ, ఎస్టి, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- UR, OBC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/- రూపాయలు..
ఎంపిక విధానం వివరాలు :
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ , కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here