BEL Trainee Engineer Latest Notification : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల భారతదేశ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ , నవరత్న కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) – హైదరాబాద్ సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాత్కాలిక ప్రాధిపతికన భర్తీ చేస్తున్న ట్రైనీ ఇంజనీర్ – I & ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా మొత్తం ఖాళీల సంఖ్య ఎంత ? వయో పరిమితి ఏమిటి ? జీతం ఎంత లభిస్తుంది ? ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు ? వంటి అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖలో ఉద్యోగాలు – Click here
Table of Contents
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ట్రైనీ ఇంజనీర్ – I & ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ట్రైనీ ఇంజనీర్ – I ( ఎలక్ట్రానిక్స్ ) – 55
- ట్రైనీ ఇంజనీర్ – I ( మెకానికల్ ) – 11
- ట్రైనీ ఇంజనీర్ – I ( కంప్యూటర్ సైన్స్ ) – 01
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ( ఎలక్ట్రానిక్స్ ) – 06
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ( మెకానికల్ ) – 04
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ( కంప్యూటర్ సైన్స్ ) – 01
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ( ఎలక్ట్రికల్ ) – 01
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ( సివిల్) – 01
🔥 వయస్సు :
- ట్రైనీ ఇంజనీర్ – I ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I ఉద్యోగాలకు 32 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ , దివ్యాంగులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయోసడలింపు లభిస్తుంది.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు కొరకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కానీ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 2 సంవత్సరాల పని అనుభవం అవసరం.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- నోటిఫికేషన్ లో ప్రస్తావించిన గూగుల్ ఫారం లింక్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసి , అప్లై చేసుకోవచ్చు.
- అభ్యర్థులు 28/08/2025 నుండి 12/09/2025 లోపుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష నిర్వహణ :
- వ్రాత పరీక్షను 14/09/2025 ( ఆదివారం ) నాడు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 09:00 గంటలకు హాజరు అవ్వాల్సి వుంటుంది.
- వ్రాత పరీక్ష నిర్వహణ స్థలం : Little Flower Junior College,Opp. Survey of India, P&T Colony, Uppal, Hyderabad – 500039.
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ :
- ఇంటర్వ్యూ ను 15/09/2025 న BEL factory (Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad – 500 076 నందు నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 28/08/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 12/09/2025
- వ్రాత పరీక్ష తేదీ : 14/09/2025
- ఇంటర్వ్యూ తేదీ : 15/09/2025
👉 CLICK HERE FOR OFFICIAL WEBSITE