పదో తరగతి అర్హతతో ఆశ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Asha Worker Jobs Recruitment 2025

Asha Worker Jobs Recruitment in Andhrapradesh
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ASHA Worker Jobs Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లో పనిచేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 04/09/2025 నడు ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు 13/09/2025 లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా మొత్తం ఖాళీల సంఖ్య ఎంత ? ఏ విధంగా ఎంపిక చేస్తారు ? విద్యార్హతలు ఏమిటి ? ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

పదో తరగతి అర్హతతో 13,217 ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఆశ వర్కర్లు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 61 ఆశ వర్కర్లను నియామకం చేస్తున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 49 & పట్టణ ప్రాంతంలో 12 ఖాళీలను భర్తీ చేస్తారు.

🔥 అవసరమగు వయస్సు :

  • 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 విద్యార్హత :

  • కనీసం 10వ తరగతి సాధించి ఉండాలి , 12వ తరగతి సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్న వారు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ఫారం లో ఫీల్ చేసి సంబంధిత ధృవ పత్రాలను జత చేసి, PHC / UPHC నందు అందజేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 13/09/2025

🔥 ఎంపిక విధానం – మార్గదర్శకాలు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ను ఈ క్రింది అంశాల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు చేసుకునే మహిళ అదే గ్రామీణ ప్రాంతానికి / పట్టణ ప్రాంతంలోని స్లమ్ ప్రాంతానికి చెంది ఉండాలి.
  • నోటిఫికేషన్ లో ప్రస్తావించిన వయస్సు ( 25 నుండి 45 సంవత్సరాలు, విద్యార్హత ( కనీసం 10 వ తరగతి ) కలిగి ఉండాలి.
  • కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండి , నాయకత్వ లక్షణాలు ఉండాలి.
  • ఆశగా ఎంపిక కాబడిన మహిళకు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించాలి.
  • గ్రామీణ ప్రాంతంలో వెయ్యి నుండి 1500 వరకు జనాభా కు ఒక ASHA ను , పట్టణ ప్రాంతంలో 2500 నుండి 3500 వరకు ఒక ASHA ను నియామకం చేస్తారు.
  • ఎంపిక ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ వారు , పట్టణాలలో అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ వారు సమావేశం నిర్వహించి వచ్చిన దరఖాస్తులన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి మూడు దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలతో మరియు కమిటీ వారి తీర్మానంతో DM&HO కార్యాలయానికి పంపిస్తారు.

🔥ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :13/09/2025

👉 Click here to download Notification and Application

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *