APSRTC Apprentice Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి ఆరు జిల్లాల్లో వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ , పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ విద్యార్హత పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 20వ తేదీ నుండి నవంబర్ 8వ తేదీలోపు అప్లై చేయాలి..

అప్రెంటిస్ ట్రైనింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కోసం జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏపీఎస్ఆర్టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు నందు హాజరు కావాలి.