APPSC Technical Assistant (Geophysics) Notification 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జియో ఫిజిక్స్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ అన్నది ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లతో పోల్చినప్పుడు చాలా కొద్ది సార్లు మాత్రమే జరుగుతుంది. కావున సంబంధిత విద్యార్హత ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకొని అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోండి.
ఈ ఆర్టికల్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హత ఏమిటి? ఎంత వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు ? జీతభత్యాలు వంటి వివిధ అంశాలను సమగ్రంగా తెలియజేయడం జరిగింది.
Table of Contents :
🔥 APPSC Technical Assistant (Geophysics) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
✅ AP లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ నందు టెక్నికల్ అసిస్టెంట్ ( జియో ఫిజిక్స్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- రాష్ట్రవ్యాప్తంగా జోన్ – 04 లో 4 ఖాళీలు కలవు.
🔥 అవసరమగు వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & దివ్యాంగులకు పది సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 విద్యార్హత :
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా సంస్థ నుండి జియో ఫిజిక్స్ విభాగం నందు M.SC లేదా M.Sc ( Tech) లేదా M.Tech ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
🔥దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా OTPR నందు రిజిస్టర్ చేసుకోవాలి. గతంలో OTPR రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు 250 రూపాయల ప్రోసెసింగ్ ఫీజు తో పాటుగా 80 రూపాయలు ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
- అయితే ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ , వైట్ రేషన్ కార్డ్ కలిగి వున్న వారు కి ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు కలదు. వీరు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
🔥ఎంపిక విధానం :
- అభ్యర్థులను రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి 54,060/- రూపాయల బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్స్ లు లభిస్తాయి. 75,000/- రూపాయల వరకు సాలరీ లభించవచ్చు.
🔥ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 13/08/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 02/09/2025
👉 Click here for official website