AP Intermediate Education Service Jobs Recruitment 2025 | APPSC Junior Lecturer Notification 2025

APPSC JL Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

APPSC Junior Lecturer Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ లో జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హత్య చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7వ తేదీలోపు అప్లై చేయాలి..

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉన్నవారు అప్లై చేయండి. ఈ ఆర్టికల్ చివరిలో మీకోసం పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఇవ్వడం జరిగినది.

RTC లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

APPSC జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ లో జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనే పోస్టులు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

APPSC ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఉద్యోగాలు :

  • ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 7వ తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేయాలి.

విద్యార్హతలు :

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి మరియు కనీసం 50 శాతం మార్కులతో సెకండ్ క్లాస్ లో లైబ్రరీ సైన్స్ లో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఏపీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – Click here

వయస్సు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు జూలై 1 / 2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మరియు 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి .
  • ఎస్సీ , ఎస్టీ, బీసీ, PBD, ex servicemen, రేషన్ కార్డు ఉన్నవారు మరియు నిరుద్యోగులకు 120 రూపాయలు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
  • Paper-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. 150 నిమిషాల సమయం ఉంటుంది.
  • Paper-2 లో లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్ట్ నుండి 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు. 150 నిమిషాలు సమయం ఉంటుంది.
  • ఈ పరీక్షల్లో 1/3 వంతు నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంటుంది.
  • పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ లో తెలియజేశారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి..

Download Full Notification – Click here

Apply Link – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *