APPSC Forest Beat Officer Notification 2025 | APPSC Assistant Beat Officer Notification 2025

APPSC Forest Beat Officer Notification 2025 Details
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ మిత్రులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (APPSC Forest Beat Officer Notification 2025) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (APPSC Assistant Beat Officer Notification 2025) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో పనిచేసేందుకు గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది అనగా ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు.

ఇంటర్మీడియట్ విద్యార్హత తో దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

Join Our What’sApp Group – Click here

🔥 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 691 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥వయస్సు :

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు వరకు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01.07.2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.

🔥 అవసరమగు విద్యార్హత :

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి వుండాలి.

🔥శారీరక ప్రమాణాలు :

  • పురుష అభ్యర్థులు కనీసం 163 సెంటిమీటర్ల ఎత్తు కలిగి వుండాలి. 84 సెంటీ మీటర్లు చాతి కలిగి, 5 సెంటిమీటర్లు విస్తరణ రావాలి.
  • మహిళా అభ్యర్థులు కనీసం 150 సెంటి మీటర్లు ఎత్తు కలిగి , 79 సెంటి మీటర్లు చాతి కలిగి వుండాలి.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇందుకు గాను అభ్యర్థులు అధికారిక APPSC వెబ్సైట్ నందు ముందుగా OTPR రిజిస్టర్ చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకోవడానికి 16/07/2025 నుండి 05/08/2025 అవకాశం కల్పించారు.

🔥దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు 250/- రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు తో పాటుగా 80/- రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
  • ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 80/- రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఆన్లైన్/ ఆఫ్లైన్ ఆధారిత వ్రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్ష) & కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • రాష్ట్రంలో గల అన్ని జిల్లాలలో స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష నిర్వహిస్తారు.
  • మెయిన్స్ పరీక్ష ను ఎంపిక చేసిన జిల్లాలలో నిర్వహిస్తారు.
  • పరీక్షా తేదీలను ప్రకటించలేదు. తర్వాత కాలంలో ప్రకటిస్తారు.

👉 Click here for official notification

👉 Click here for official website

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!