APPSC Forest Beat Officer, Assistant Beat Officer, Forest Section Officer Hall tickets : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటవీ శాఖలో ఉద్యోగాలకు రెండు నోటిఫికేషన్లు విడుదల చేయగా అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి మరొక నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ నుండి విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించబోతున్నట్లుగా నోటిఫికేషన్ లో ముందుగానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసిన వివరాలు ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన జరిగే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అధికారులు విడుదల చేశారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం నిర్వహిస్తారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నంబర్ (OTPR) మరియు పాస్వర్డ్ , క్యాప్చ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ Download Hall Tickets – Click here
✅ Official Website – Click here