APPSC Endowment EO Notification 2025 in Telugu | AP Endowment Executive Officer Notification 2025

AP Endowment EO Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

APPSC Endowment EO Notification 2025 Details : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ లో పనిచేసేందుకు గాను ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత తో దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగానికి సంబంధించి , నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని అభ్యర్థులు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది.

ఎండోమెంట్ ఈవో ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ నోటిఫికేషన్ కి ఎవరు అర్హులు ? వయస్సు ఎంత ఉండాలి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? మొదలగు అన్ని అంశాల కొరకు ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

✅ AP లో ANM కోర్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

🔥APPSC Endowment EO నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ లో పనిచేసేందుకు గాను ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Endoment Executive officer ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేసే ఎండోమెంట్ ఈవో (Endowment EO) ఉద్యోగాల సంఖ్య :

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 APPSC Endowment EO Qualification :

  • గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలదు.
  • హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

🔥APPSC Endowment EO Required Age Details:

  • ఎండోమెంట్ ఇవ్వ ఉద్యోగాలకు సంబంధించి 18 సంవత్సరాల నుండి నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఎస్సీ మరియు ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలకు వీరికి 10 సంవత్సరాలు వయసడలింపు వర్తిస్తుంది.
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మూడు సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.

🔥AP Endowment Executive Officer Jobs Apply Process :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఏపీపీఎస్సీ వారి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఏపీపీఎస్సీ వెబ్సైట్ నందు ముందుగా ఓటీపీఆర్ (OTPR – one time profile registration )నందు రిజిస్టర్ చేసుకోవాలి.
  • గతంలో ఎవరైనా ఓటిపిఆర్ రిజిస్టర్ చేసుకున్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అటవీ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు – Click here

🔥దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫీజు క్రింద 250 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీజు కింద 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
  • అయితే ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా వైట్ రేషన్ కార్డు కలిగియున్నవారు 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వీరికి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

🔥ఎంపిక విధానం :

  • ఎండోమెంట్ ఈవో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
  • రాత పరీక్ష డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ ఆధారిత ప్రశ్నలను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా పేపర్ – 01 : జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ విభాగం లో 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. 150 నిముషాల కాలపరిమితి కలదు.
  • అలానే పేపర్ – 02 : హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టం 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. 150 నిముషాల కాల పరిమితి కలదు.
  • పూర్తి సిలబస్ కొరకు అధికారిక వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ ను చదవగలరు.

🔥 AP Endowment Executive Officer Salary Details :

  • ఈ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి బేసిక్ పే 25,220 /-రూపాయలు తో పాటు వివిధ ఎలెవెన్సులు లభిస్తాయి. వీరికి 40 వేల రూపాయల ప్రారంభ వేతనం లభిస్తుంది.

🔥ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 13/08/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :02/09/2025 ( రాత్రి 11:00 గంటల లోపు)

👉 Click here for notification

👉 Click here for official website

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *