APPSC స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఉండదా? ఒకే ఎగ్జామ్ తో రిక్రూట్మెంట్ నిర్వహిస్తారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O Ms no:72 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలక సంబంధించి కీలక అంశంగా తెలుస్తుంది.
ఈ జీవో ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకనుండి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఇకనుండి ఫిలిమ్స్ మెయిన్స్ అంటూ రెండు పరీక్షలు లేకుండా కేవలం మెయిన్ పరీక్షలో రాసి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం ఉంది.
ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో యొక్క పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ ఏపీ లో టెన్త్ అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥APPSC స్క్రీనింగ్ పరీక్ష విధానంలో మార్పు:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష విధానంలో కీలక సంస్కరణలకు ఆమోదముద్ర తెలిపింది.
- ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం లో మార్పు తీసుకువచ్చింది.
- ప్రస్తుతం ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ కు 25000 కంటే అధికంగా దరఖాస్తులు వచ్చినట్లయితే ఆ ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరిగా ఉండేది.
- అయితే ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేస్తూ, ఉద్యోగ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాల సంఖ్య కంటే 200 రెట్లు అధికంగా దరఖాస్తులు సమర్పించినప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకుగాను కమిషన్ కి అధికారాలు ఉన్నట్లు చెప్పారు. అంటే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ అనేది పూర్తిగా ఏపీపీఎస్సీ యొక్క అభీష్ట మేరకు మాత్రమే జరుగుతుంది.
🔥 APPSC నుండి గతంలోనే ప్రతిపాదనలు:
- రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది.
- నిరుద్యోగ అభ్యర్థులు ఏదైనా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రిలిమ్స్ , మెయిన్స్ అంటూ జరిగే ఈ పరీక్షలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అధిక సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్థిక భారం ఉండేది.
- ప్రస్తుతం నిర్ణయం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు నోటిఫికేషన్ కు కేటాయించాల్సిన సమయం తగ్గుతుంది దీనివల్ల అభ్యర్థులకు ఆర్థిక భారం తగ్గడం తో పాటు అవసరాన్ని బట్టి ఇతర నోటిఫికేషన్ లకు కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం లభిస్తుంది.
- ఈ అంశానికి సంబంధించి ఏపీపీఎస్సీ గతంలో ప్రతిపాదించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
🔥 వేగంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ :
- రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వీలైనంత వేగంగా రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంటుంది.
- తక్కువ సమయంలోనే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు గాను ఏపీపీఎస్సీ వారికి అవకాశం లభిస్తుంది.
- ఈ నిర్ణయం వలన ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారితో పాటుగా నిరుద్యోగులకు , అభ్యర్థులకు కూడా మంచి జరుగుతుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే అన్ని పరీక్షలు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కావడంతో ఒకేసారి ఎంతమందికైనా పరీక్ష నిర్వహించే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీ వారు ప్రతిపాదించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం నిరుద్యోగ , అభ్యర్థుల పట్ల ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫాస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది మరికొద్ది రోజుల్లో ఎండోమెంట్ ఈవో ఉద్యోగాల భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ తీసుకువచ్చిన ఈ సంస్కరణ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీ వారు విడుదల చేసే నోటిఫికేషన్లను పరిశీలిస్తూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవగలరని ఆశిస్తున్నాము.
✅ APPSC Official Website – Click here