APCOB Staff Assistant and Manager Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ ట్యాంక్ లిమిటెడ్ ( APCOB ) సంస్థ శుభవార్త తెలియజేసింది. ఈ సంస్థ నుండి మేనేజర్ స్కేల్ – 1 మరియు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను వేరువేరుగా రెండు నోటిఫికేషన్లు జారీచేసింది.
బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. సొంత జిల్లాలోని ఉద్యోగం చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఏదైనా డిగ్రీ అర్హతతో మేనేజర్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మొత్తం ఖాళీల సంఖ్య ఎంత ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి ఎంత జీతం లభిస్తుంది ? మరియు ఎంపిక విధానం ఏమిటి? వంటి వివిధ అంశాల పూర్తి వివరాలకు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
Table of Contents
✅ AP జైళ్ళ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 APCOB నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ద ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ఈ ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥APCOB భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- మేనేజర్ స్కేల్ వన్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥APCOB భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- మేనేజర్ స్కేల్ 1 – 25
- స్టాఫ్ అసిస్టెంట్ – 13
🔥 వయస్సు :
- స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలలోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- మేనేజర్ ఉద్యోగాలకు 20 సంవత్సరాల వయసు నిండి 30 సంవత్సరాల లోపు వయసుగల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు పది సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.
- ఈ ఉద్యోగాలకు కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
🔥 విద్యార్హత :
- మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
- అభ్యర్థులు విద్యార్హత కలిగి ఉంటే మేనేజర్ మరియు స్టాఫ్ నర్స్ రెండింటికి కూడా వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు తెలుగు భాషా మరియు ఇంగ్లీష్ భాష పై ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.
- విద్యార్హత కి సంబంధించి 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 దరఖాస్తు విధానం :
- ఈ నోటిఫికేషన్ లకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- 27/08/2025 నుండి 10/09/2025 లోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
🔥దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేదు దరఖాస్తు ఫీజులు ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు 590 రూపాయలు చెల్లించాలి.
- ఓసి , ఈడబ్ల్యూఎస్ , బీసీ అభ్యర్థులు 826 రూపాయలు చెల్లించాలి.
- అభ్యర్థులు ఫీజు చెల్లింపు కొరకు చివరి తేదీ 10/09/2025.
🔥 ఎంపిక విధానం :
- స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
- మేనేజర్ స్కేల్ వన్ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం :
- స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి ఒకే విధమైన రాత పరీక్ష నిర్వహణ ఉంది. అయితే ఈ పరీక్ష సమయం అన్నది మేనేజర్ ఉద్యోగాలకు రెండు గంటల గడువు ఇవ్వగా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రెండు గంటల 30 నిమిషాల వరకు అవకాశం లభిస్తుంది.
- ఈ పరీక్షలో రీజనింగ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ , జనరల్ ఎవేర్నెస్ , కంప్యూటర్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
- ఒక్కొక్క విభాగం నుండి 40 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులు గాను పరీక్షలు నిర్వహణ ఉంటుంది.

🔥 పరీక్షా కేంద్రాలు :
- ఆంధ్రప్రదేశ్ లో గల ప్రముఖ నగరాలలో పరీక్ష నిర్వహణ ఉంటుంది.
- శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం , కాకినాడ , రాజమండ్రి , ఏలూరు , విజయవాడ , గుంటూరు , ఒంగోలు , నెల్లూరు , తిరుపతి , కడప , కర్నూల్ , అనంతపూర్ నందు పలు పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు.
🔥 జీతభత్యాలు :
- స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అన్ని అలవెన్సులతో కలిపి ప్రారంభ జీతం 47198 /- రూపాయలు లభిస్తుంది.
- మేనేజర్ స్కేల్ 1 ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి ప్రారంభ జీతం 87074 /- రూపాయలు లభిస్తుంది..
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 27/08/2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 10/09/2025.
- ఫీజు పేమెంట్ కొరకు చివరి తేదీ : 10/09/2025
- రాత పరీక్ష నిర్వహణ ( తాత్కాలికం ) : సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల , 2025
click here for staff assistant notification
click here for manager notification
click here for official website to apply