ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడ ప్రధాన కేంద్రంగా గల కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అపెక్స్ సంస్థ ” స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ , ఆంధ్రప్రదేశ్ (స్త్రీ నిధి ఎ.పి – Stree Nidhi Credit Cooperative Federation Ltd Recruitment 2025) సంస్థ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో 170 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
స్త్రీ నిధి సంస్థ ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ , 1964 క్రింద ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల లో గల మహిళలకు అతి తక్కువ వడ్డీ తో రుణాలు మంజూరు చేస్తారు. తాజాగా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? వయోపరిమితి ఎంత ఉండాలి ? దరఖాస్తు ఫీజు ఎంత? ఏ విధంగా ఎంపిక చేస్తారు? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 రాష్ట్రంలో ATM కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు – Click here
🔥నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల ను కాంట్రాక్ట్ ప్రాదిపాదికన భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 170 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అవసరమగు విద్యార్హత:
- UGC / AICTE ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి వున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు వయోపరిమితి:
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు కనీసం 21 సంవత్సరాలు నిండి యుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & దివ్యాంగులకు పది సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్ మెన వారికి 3 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
- ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి జూలై 07 నుండి జూలై 18 వరకు అవకాశం కల్పించారు.
🔥అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు 1000/- రూపాయలు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు గా చెల్లించాలి.
🔥ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిని వారి విద్యార్హత లో వచ్చిన మార్కుల మెరిట్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు గాను అకడమిక్ విద్యార్హత మరియు పని అనుభవానికి 75 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ కి 25 మార్కులు కేటాయించారు.
🔥 స్కోరింగ్ పాటర్న్:
- అకడమిక్ విద్య లో వచ్చిన మార్కులకు మరియు పని అనుభవానికి 75 మార్కుల వెయిటేజ్ కల్పించగా అందులో ఈ క్రింది అంశాలను ప్రస్తావించారు. అవి
- 10 వ తరగతి లో వచ్చిన మార్కులకు గరిష్టంగా 10 మార్కులు కేటాయించారు.
- ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులకు గరిష్టంగా 10 మార్కులు కేటాయించారు.
- డిగ్రీ లో వచ్చిన మార్కులకు గరిష్టంగా 30 మార్కులు కేటాయించారు.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి MS ఆఫీస్/ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వున్న వారికి గరిష్టంగా 5 మార్కులు కేటాయించారు.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉంటే గరిష్టంగా15 మార్కులు లభిస్తాయి.
- 01.06.2025 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయితే సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున గరిష్టంగా 5 మార్కులు కేటాయించారు.
- వ్యక్తిగత ఇంటర్వ్యూ కి 25 మార్కులు కేటాయించారు.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 25,520/- రూపాయలు జీతం లభిస్తుంది.
- స్త్రీ నిధి ఆంధ్రప్రదేశ్ నిబంధనల మేరకు ఇతర ఆలోవెన్సులు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన అంశాలు :
- ఈ ఉద్యోగాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా , రోస్టర్ విధానం లో ఎంపిక చేస్తారు.
- ఒక సంవత్సరం కాలానికి గాను కాంట్రాక్ట్ విధానం లో ఎంపిక నిర్వహిస్తున్నారు.
- అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపిక అయిన వారు ఒక సంవత్సరం కాలానికి గాను పనిచేయనున్నట్లు 100 రూపాయల బాండ్ పై అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎంపిక కాబడిన వారు 75,000 రూపాయలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి.
- విద్యార్హత కి మరియు ఇతర అంశాలకు 01/06/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ధారించారు.
🔥ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అధికారక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 07/07/2025 సాయంత్రం 05:00 గంటల నుండి.
- ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 18/07/2025.