AP Police Constable Mains Exam Answer Key | Download AP Police Constable Mains Question Paper and Answer Key

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు అనగా జూన్ 1వ తేదీ నాడు ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ పాస్ అయిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తం 97.52% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 38,555 అభ్యర్థులకు గాను 37,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయడం జరిగింది. 955 అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.

2022 సంవత్సరంలో నవంబర్ 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ వివిధ రకాల కోర్టు కేసులు కారణంగా మెయిన్స్ పరీక్ష జరగలేదు. ఎట్టకేలకు జూన్ 1వ తేదీన ఎంపిక ప్రక్రియలో భాగంగా తుది రాత పరీక్షను ప్రశాంతంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించింది. పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతిలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది.

పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రం సులభంగానే వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Download AP Police Constable Mains Exam Answer Key :

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో అధికారిక “కీ” ను విడుదల చేసింది.

మీకోసం క్రింద ప్రశ్నా పత్రము మరియు ప్రాథమిక ఆన్సర్ ” కీ” ను అందిస్తున్నాము. అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ “కీ” పై జూన్ 4వ తేదీ లోపు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు స్వీకరించి, అభ్యంతరాలను పరిశీలించి తుది”కీ” ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేస్తుంది.

తుది రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు కొన్ని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈవెంట్స్ లో వచ్చిన మార్కులను కూడా పరిగణలోకి తీసుకొని సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు.

ఎంపికైన వారికి పోలీస్ శాఖ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది..

Download Constable Mains Question Paper – Click here

Download Constable Mains Answer Key – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *