ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ప్రస్తుతం అభ్యర్థులు AP Police Constable Cut off Marks మరియు సెలక్షన్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
✅ Join Our Telegram Group – Click here
పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ఎంత మంది రాశారు ?
పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను జూన్ 1వ తేదీన విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు , కర్నూలు, తిరుపతి నగరాల్లో వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 37,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు.. వీరిలో 33,921 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణులైన వారిలో 29,211 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. 4,710 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు చెక్ చేసుకునే విధానం :

పరీక్ష రాసిన అభ్యర్థులు APSLPRB వెబ్సైట్ లో తుది రాత హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ వివరాలతో తమ మార్కులు తెలుసుకోవచ్చు.
✅ AP Police Constable Results – Click here
అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ నుండి ఈనెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఓఎంఆర్ షీట్ వెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు.
సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నెంబర్స్:
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 94414 50639 , 91002 03323 అనే నంబర్లను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల వరకు కాల్ చేయవచ్చు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా మోసపూరిత ప్రకటనలు చేస్తే ఈ నెంబర్లకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు.
AP Police Constable Cut off Marks & Selection List :
మరికొద్ది రోజుల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు ఫైనల్ చేసి సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనుంది.