AP Outsourcing Jobs Recruitment 2023 | సొంత జిల్లాలో ఉద్యొగం | APCOS

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పారామెడికల్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు . కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్ అధికారిక వెబ్సైట్లో తర్వాత పెట్టడం జరుగుతుంది . కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ చూస్తూ ఉండాలి .

ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ను కాకినాడలో ఉన్న ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఉన్న వివిధ ఖాళీలు భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది . 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కాకినాడ జిల్లా

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఔట్సౌర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : థియేటర్ అసిస్టెంట్ , మెల్ నర్సింగ్ ఆర్డర్లీ , ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి

మొత్తం పోస్టులు : 07

🔥 అర్హతలు : 

  1. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి పదో తరగతి అర్హతతో పాటు డిప్లమో ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.  ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. 
  2. మెయల్ నర్సింగ్ ఆర్డర్ లీ మరియు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి .

ముఖ్యమైన తేదీలు 👇👇👇

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 21-07-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 29-07-2023

షార్ట్ లిస్ట్ ఫైనల్ చేయు తేదీ : అధికారిక వెబ్సైట్లో తరువాత అప్డేట్ చేస్తారు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయు తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత అప్డేట్ చేస్తారు .

కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : 

ఈ మూడు రకాల ఉద్యోగాలకు 15 వేల రూపాయలు చొప్పున వేతనం ఉంటుంది .

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు . 

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ మరియు అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు.

✓ సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

🔥 ఫీజు : అప్లై చేసే ఓసి , బీసీ అభ్యర్థులు 400/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ , ఎస్టి , ఈడబ్ల్యూఎస్ , ఎక్స్ సర్వీస్ మెన్ , దివ్యాంగులైన అభ్యర్థులు 200/- రూపాయలు ఫీజు చెల్లించాలి .

ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు అప్లై చేసే ప్రతి ఉద్యోగానికి వేరువేరుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి . 

Note : ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత రిఫండ్ చేయడం జరగదు .

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ని పూర్తి చేసి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతపరిచి కాకినాడలో ఉన్న ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి యొక్క పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో జూలై 29 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ ను అందజేయాలి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *