Headlines

AP హైకోర్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | AP High Court Jobs Recruitment 2025 | Latest Jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉన్న హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి 50 పోస్టులతో జూనియర్ డివిజన్ లో సివిల్ జడ్జ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 10 పోస్టులను ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20వ తేదీ నుండి మార్చి 17వ తేదీలకు సబ్మిట్ చేయాలి. 

అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 16వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు.

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లై విధానము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేయండి. 

AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి…

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥  భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 40 పోస్టులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా, 10 పోస్టులు ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

🔥 అర్హతలు : 

  • డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేయడానికి “ లా “ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 

🔥 అప్లికేషన్ మరియు పరీక్ష ఫీజు : 

  • OC, BC, EWS అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 1500/- చెల్లించాలి. 
  • SC, ST, PwBD అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 750/- చెల్లించాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • 01-02-2025 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. 

🔥 వయసులో సడలింపు వివరాలు : 

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా 
  • SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 17-03-2025

🔥 స్క్రీనింగ్ టెస్ట్ తేదీ : 

  • ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 16వ తేదీన నిర్వహిస్తారు.

🔥 జీతం ఎంత ఉంటుంది : 

  • ఎంపికైన వారికి 77,840/- నుండి 1,36,520/- వరకు పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

  • ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రాత పరీక్ష, వైవా వాయిస్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ మెరిట్ లిస్ట్ 1:3 నిష్పత్తిలో విడుదల చేస్తారు.

🔥 స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే పరీక్ష కేంద్రాలు : 

  • గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి , విజయవాడ , విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం :

  • అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో అప్లై చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.

Download Notification & Application 

🔥 Official Website – Click here 

🔥 గమనిక : 

  • అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!