Download AP High Court Exams Response Sheet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. పది రకాల నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నోటిఫికేషన్ ల ద్వారా మొత్తం 1621 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది.
ఈ పది రకాలు నోటిఫికేషన్స్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మే 13వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్నారు.
ఆగస్టు 20వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు.
తాజాగా సెప్టెంబర్ 1వ తేదీన అభ్యర్థులు రాసిన పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ విడుదల చేయడం జరిగింది.
అభ్యర్థులు తమ OTPR మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి లాగిన్ అయిన తర్వాత రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ రెస్పాన్స్ సీట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం తెలుసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి వీడియో చూడండి.
రెస్పాన్స్ సీట్స్ డౌన్లోడ్ చేసేందుకు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మీ OTPR మరియు పుట్టిన తేదీ, అక్కడ కనిపించిన CATPCHA నమోదు చేసి లాగిన్ అవ్వండి.
✅ Download Response Sheet – Click here
