ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ స్టేట్ బ్లడ్ సెల్ లో పోస్టులు భర్తీకి అర్హత ఉన్న వార నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పాథాలజిస్ట్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీ నుండి అక్టోబర్ 26వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
Table of Contents
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా పాథాలజిస్ట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేస్తున్నారు.
ఉండవలసిన విద్యార్హతలు :
సంబంధిత సబ్జెక్టులో MD లేదా DNB పూర్తి చేసి ఉండాలి.
కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతము వివరాలు :
ఎంపికైన వారికి నెలకు 1,10,000/- జీతము ఇస్తారు..
ఎంపిక విధానము :
ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.. ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు వచ్చిన మార్కులకు 75% వెయిటేజి ఇస్తారు. విద్యార్హత పూర్తయినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. మరియు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవం ఉన్నవారికి 15% వెయిటేజీ మార్కులు ఇస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
O/o APSACS (AP State AIDS Control Society), 2nd floor, SP’s River view building,
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 16వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ లోపు అప్లై చేయాలి.
✅ Download Notification – Click here