AP Forest Department Thanedar Notification 2025 | APPSC Thanedar Notification 2025 Qualification , Syallabus, Age , Selection Process

AP Thanedar Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Forest Department Thanedar Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అటవీ శాఖలో తానేదార్ ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో సెప్టెంబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఆన్లైన్ విధానంలో అప్లై చేసే సమయంలో ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో OTPR లాగిన్ అయి అప్లై చేయాల్సి ఉంటుంది. OTPR రిజిస్ట్రేషన్ ఇంతవరకు చేయనివారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తరువాత అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన మరొకటి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ మీరు చివరి వరకు చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదవండి.

The organization has released a notification for the recruitment of Thanedar posts in the Forest Department‌ (నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ) :

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో తానేదార్ ఉద్యోగాలు భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Qualifications required for Forest Department Thanedar jobs (అర్హతలు):

  1. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి.
  2. పురుష అభ్యర్థులు అయితే కనీసం 163 సెంటీమీటర్ల ఎత్తు , 84 సెంటీమీటర్ల ఛాతి కలిగి ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.
  3. మహిళా అభ్యర్థులు అయితే కనీసం 150 సెంటీమీటర్ల ఎత్తు, 79 సెంటీమీటర్ల ఛాతి కలిగి ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.

Thanedar Jobs Selection Process (ఎంపిక విధానము) :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష, Essay Writing Test, వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇందులో Essay Writing Test మరియు వాకింగ్ టెస్ట్ క్వాలిఫై టెస్టులు మాత్రమే. ఈ రెండు టెస్టుల్లో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు.

నడక పరీక్ష వివరాలు :

వాకింగ్ టెస్ట్ లో భాగంగా పురుష అభ్యర్థులు 25 కిలోమీటర్ల దూరం 4 గంటల్లో నడవాలి. మహిళా అభ్యర్థులు 16 కిలోమీటర్ల దూరం 4 గంటల్లో నడవాలి.

పరీక్ష విధానం వివరాలు :

  1. Essay Writing Test నిర్వహిస్తారు. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్. ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ భాషలో ఉంటుంది. ఒక ప్రశ్న ఉంటుంది, 50 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు. ఇది క్వాలిఫై టెస్ట్ మాత్రమే.
  2. పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. వంద నిమిషాలు సమయం ఉంటుంది.
  3. పేపర్-2 లో జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ నుండి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. వంద నిమిషాలు సమయం ఉంటుంది.
  4. GO M.S No 235 ప్రకారం 1/3 వంతు నెగిటివ్ మార్కులు విధానం అమలులో ఉంటుంది.

వయస్సు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 01-07-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.

వయసులో సడలింపు వివరాలు :

ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు సదలింపు ఇస్తారు.

పరీక్ష తేదీ :

నోటిఫికేషన్ లో పరీక్ష తేదీ వివరాలు ప్రకటించలేదు. తరువాత ప్రకటిస్తారు.

అప్లికేషన్ విధానం :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో OTPR లాగిన్ అయ్యి అప్లై చేయాలి.

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 11వ తేది నుండి అక్టోబర్ 1వ తేదిలోపు అప్లై అప్లై చేయాలి.

Download Notification – Click here

✅ Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!