ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభం అయిన AP EAPCET Counselling Important Instructions | AP EAPCET Counselling 2025

AP EAPCET Counselling 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన EAPCET పరీక్ష యొక్క కౌన్సిలింగ్ (AP EAPCET) ప్రక్రియ ప్రారంభం అయ్యింది . ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE ) సంస్థ జూలై 07 వ తేదీ నుండి అధికారికంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించింది.

రాష్ట్రం లో గల వివిధ కాలేజీ లలో ఇంజనీరింగ్ , ఫార్మసీ , వ్యవసాయ కోర్సు లలో డిగ్రీ చేసేందుకు గాను ఈ కౌన్సిలింగ్ లో పాల్గొనాల్సి వుంటుంది.

కౌన్సిలింగ్ లో పాల్గొనే విద్యార్థులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ? మరియు ఫీజు ఏ విధంగా పే చేయాలి అనే అంశాలను ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది.

🔥AP EAPCET Counselling రిజిస్ట్రేషన్ పూర్తి చేయు విధానం :

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి EAPCET – 2025 అనే టాబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ ఫామ్ లో లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • ఆటోమేటిక్ గా వచ్చే అన్ని డీటెయిల్స్ సరి చూసుకొని , తప్పులు ఉంటే సరిచేసుకోవాలి. సంబంధిత ధృవ పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • డీటెయిల్స్ అన్ని మరొకసారి కన్ఫర్మ్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాలి.
  • పేమెంట్ పూర్తి అయ్యాక సబ్మిట్ చేసి , రిసీప్ట్ ను డౌన్లోడ్ చేసుకొని , ప్రింట్ తీసుకోవాలి.

🔥AP EAPCET Counselling ఫీజు చెల్లింపు వివరాలు :

  • జనరల్ (ఓసి) మరియు బీసీ అభ్యర్థులు 1200/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 600 /- రూపాయలు ఫీజు చెల్లించాలి.

🔥AP EAPCET Counselling ముఖ్యమైన తేదీలు :

  • రిజిస్ట్రేషన్ మరియు ఫీజు పేమెంట్ చేయుటకు అవకాశం కల్పించుట : జూలై 07 నుండి జూలై 16 వరకు
  • హెల్ప్ సెంటర్స్ నందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయుట : జూలై 17 వరకు
  • వెబ్ ఆప్షన్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పించుట: జూలై 13 నుండి జూలై 18 వరకు.
  • వెబ్ ఆప్షన్స్ మార్చేందుకు అవకాశం : జూలై 19
  • ఫేజ్ -1 సీటు అల్లోట్మెంట్: జూలై 22
  • కాలేజ్ కి రిపోర్ట్ చేయుట : జూలై 23 నుండి జూలై 26 వరకు
  • క్లాసెస్ ప్రారంభం : ఆగస్టు 04 నుండి.

🏹 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!