ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ఇంజినీరింగ్, వ్యవసాయ మరియు ఫార్మసీ రెండు విభాగాల్లో కూడా అబ్బాయిలే టాప్ 10 స్థానాల్లో నిలిచారు.
AP EAPCET ఫలితాల్లో అబ్బాయిలు (80.12%) కంటే అమ్మాయిలు (81.56%) అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
AP EAPCET లో ఉత్తీర్ణత మార్కులు ఎన్ని ?
ఏపీ ఈఏపిసెట్ లో ఉత్తీర్ణత పొందాలి అంటే ఓసి మరియు బీసీ అభ్యర్థులకు కనీసం 25% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం మార్కులు లేవు.
AP EAPCET లో రెండు ప్రశ్నలకు సమాధానాలు మార్పు :
AP EAPCET లో రెండు ప్రశ్నలకు సమాధానాలు మార్చడం జరిగింది. ప్రాథమిక “కీ” పై విద్యార్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భౌతిక శాస్త్రం మరియు జంతు శాస్త్రంలో రెండు ప్రశ్నలకు సమాధానాలను మార్చడం జరిగింది.
AP EAPCET కౌన్సిలింగ్ ఎప్పుడు ?
AP EAPCET కౌన్సిలింగ్ కు సంబంధించి కూడా క్లారిటి వచ్చింది. జేఈఈ మెయిన్స్ , అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ తరువాతే రాష్ర్టంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
✅ పదో తరగతి అర్హతతో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు – Click here
🏹 AP EAPCET Toppers List :
ఇంజనీరింగ్ లో టాప్ 10 ర్యాంకర్స్ వీరే :
- అవనిగంటి అనిరుద్ రెడ్డి
- మాధవ్యపురం భానుచరణ్ రెడ్డి
- కోటిపల్లి యశ్వంత్ సాత్విక్
- ఉద్గండల రామ్ చరణ్ రెడ్డి
- భూపతి నితిన్ అగ్నిహోత్రి
- తెలగ తోటి విక్రం లెవీ
- దేశి రెడ్డి మణిదీప్ రెడ్డి
- షాగంటి త్రిశూల్
- ధర్మాన జ్ఞాన రూత్విక్ సాయి
- భద్రిరాజు వెంకటమణి ప్రీతం
అగ్రికల్చర్, ఫార్మసీ టాప్ 10 ర్యాంకర్స్ వీరే :
- రామాయణం వెంకట నాగసాయి హర్షవర్ధన్
- షణ్ముఖ నిశాంత్ అక్షింతల
- డేగల అకిరా నందన్ వినయ్ మల్లేష్ కుమార్
- యడ్రపాటి షణ్ముఖ్
- ఏలమోలు సత్య వెంకట్
- సిరిదేల్ల శ్రీశశి గోవర్ధన్
- గిరడ లక్ష్మీ చరణ్
- దర్బా కార్తిక్ రామ్ కిరీటి
- కోదాటి మోహిత్ శ్రీరామ్
- దేసిన సూర్యచరణ్
✅ Official Website – Click here