ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఎగ్జామినర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, దరఖాస్తు విధానం? ఎంపిక విధానం? అవసరమగు ధ్రువపత్రాలు? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ? దరఖాస్తు చేయుటకు చివరి తేదీ ఏమిటి? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నుండి జిల్లా కోర్టులలో ఎగ్జామినర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామినర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥అవసరమగు విద్యార్హత :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
🔥 భాషా అర్హత:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వారు దరఖాస్తు చేయు జిల్లాకు సంబంధించిన స్థానిక భాష / స్థానిక భాషలపై ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అనంతపురం జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా కన్నడ భాష పై కూడా అవగాహన ఉండాలి.
చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా తమిళం భాష పై అవగాహన ఉండాలి.
శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషతో పాటుగా ఒరియా భాష పై అవగాహన కలిగి ఉండాలి.
మిగతా అన్ని జిల్లాల వారు కూడా కేవలం తెలుగు భాష పై అవగాహన ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥వయస్సు:
18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు:
డేట్ ఆఫ్ బర్త్ కొరకు సంబంధిత ధ్రువపత్రం
కుల ధ్రువీకరణ పత్రం
ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ (సంబంధిత వర్గాల వారు)
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (సంబంధిత వర్గాల వారు)
సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులు)
ఎక్స్ సర్వీస్ మెన్ వారు డిశ్చార్జ్ సర్టిఫికెట్
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
స్థానికత నిర్ధారణ కొరకు 4వ తరగతి నుండి 7 తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
ఓసి, బిసి, EWS, అభ్యర్థులు 800/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
వ్రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 పరీక్షా విధానం:
90 నిముషాల కాలపరిమితి తో 80 బహుళైచ్చిక ప్రశ్నలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఇస్తారు.
ఇందులో జనరల్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు & జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు వుంటాయి.
ప్రతీ ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు.
జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాష లో ఉంటాయి.
🔥 జీతం:
ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 23,780/- నుండి 76,730/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు. మరియు వివిధ అలవెన్సులు కూడా కూడా ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
నోటిఫికేషన్ విడుదల చేసిన తేది : 06/05/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/05/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :02/06/2025
🔥 హెల్ప్ డెస్క్ వివరాలు:
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులు ఇమెయిల్ ఐడి: helpdesk-hc.ap@aij.gov.in & టెలిఫోన్ నెంబర్ : 0863 – 2372752 కు సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఉదయం 10:30 నిముషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. (మధ్యాహ్నం 01:30 నుండి 02:15 వరకు లంచ్ బ్రేక్ )
👉 Click here for official website