ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 06-05-2025 తేదిన జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకొని పరీక్ష తేదీలు (AP District Court Exam Dates 2025) కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్…
10-07-2025 తేదిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు.
🏹 ప్రతిరోజు వివిధ ఉద్యోగాల సమాచారం మీ మొబైల్ కి రావాలంటే వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి..
✅ Join Our Telegram Group – Click here
AP District Court Exam Dates 2025 :
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ (లైట్ వెహికల్), రికార్డ్ అసిస్టెంట్ , ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీల షెడ్యూల్ విడుదలైంది.

AP District Court Exam Dates Announced :
- డ్రైవర్, ప్రాసెస్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 20 మరియు ఆగస్టు 21 తేదీల్లో మొత్తం ఆరు సెషన్స్ లో నిర్వహిస్తారు.
- కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆగస్టు 22వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష నిర్వహిస్తారు.
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆగస్టు 23 మరియు 24 తేదీల్లో ఆరు సెషన్స్ లో పరీక్షలు నిర్వహిస్తారు.
AP District Court Hall Tickets విడుదల తేది :
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల పరీక్ష తేదీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల హాల్ టికెట్స్ ఆగస్టు 13వ తేదీ నుంచి హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాబట్టి అభ్యర్థులు ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ లో ఆగస్టు 13వ తేదీ నుండి తమ వివరాలుతో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు.