AP Digital Corporation Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , జనరల్ అడ్మినిస్ట్రేషన్ (I & PR) విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ( APDC ) సంస్థ నుండి డిజిటల్ మరియు సోషల్ మీడియా విభాగాలలో పనిచేసేందుకు గాను అవుట్సోర్సింగ్/ తాత్కాలిక పద్ధతిలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ ఉనికిని బలోపేతం చేయడానికి బాధ్యత వహించే మార్గదర్శక సంస్థగా, ప్రభుత్వానికి మరియు అట్టడుగు వర్గాలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఏర్పడిన సంస్థ ఇది. కీలకమైన సమాచారాన్ని ప్రచారం చేయడం మరియు వ్యాప్తి చేయడం APDC యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఖాళీల సంఖ్య ఎంత ? ఏ విధమైన విద్యార్హత లు ఉండాలి. జీతం ఎంత లభిస్తుంది ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసేందుకు గాను సోషల్ మీడియా ఆనలిస్ట్ , డిజిటల్ క్యాంపెనర్ , సెక్యూరిటీ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అన్ని పోస్టులలో కలిపి 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్ట్లు వారీగా ఖాళీలు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- 1. సోషల్ మీడియా ఎనలిస్ట్ -05
- 2. డిజిటల్ క్యాంపెనర్ – 05
- 3. సెక్యూరిటీ కన్సల్టెంట్ – 01
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంత వయసు ఉండాలి అన్న అంశాన్ని నోటిఫికేషన్ లో ప్రస్తావించలేదు కానీ ప్రభుత్వం నియమ నిబంధన మేరకు లభిస్తుంది అని తెలిపారు.
✅ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో 500 ఉద్యోగాలు – Click here
🔥 అవసరమగు విద్యార్హత :
- సోషల్ మీడియా ఎనలిస్ట్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీ ఈ / బీటెక్ లేదా MCA ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏదైనా సంస్థ నందు లేదా ఫ్రీ లాన్సింగ్ గా సోషల్ మీడియా విభాగాలలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవాన్ని కలిగి ఉండాలి.
- డిజిటల్ క్యాంపెనర్ : ఈ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏదైనా సంస్థ నందు లేదా ఫ్రీ లాన్సింగ్ గా సోషల్ మీడియా విభాగాలలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవాన్ని కలిగి ఉండాలి.
- సెక్యూరిటీ కన్సల్టెంట్ : సెక్యూరిటీ కన్సల్టెంట్ గా దరఖాస్తు చేసుకునేందుకు గాను బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి, సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
🔥 దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీయొక్క రెజ్యూమే /CV ను నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అధికారిక మెయిల్ ఐడి : info.apdcl@gmail.com కి పంపించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా రెజ్యూమే /CV తో పాటుగా సంబంధిత ధ్రువపత్రాలను కూడా సాఫ్ట్ కాపీ రూపంలో 5 MB లోపుగా ఉండే విధంగా పంపించాలి.
- ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ ను ప్రస్తావించాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23/09/2025 సాయంత్రం 05:00 గంటల లోపు.
🔥 అవసరమగు ధృవపత్రాలు :
- డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్
- ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం.
- పదవ తరగతి సర్టిఫికెట్
- ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
- డిగ్రీ సర్టిఫికెట్
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మరియు ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు ఏమైనా.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- సోషల్ మీడియా ఎనలిస్ట్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 30 వేల రూపాయలు , డిజిటల్ క్యాంపెనర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 25వేల రూపాయలు , సెక్యూరిటీ కన్సల్టెంట్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 60,000 రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 10/09/2025
- ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23/09/2025
👉 Click here for official website
👉 click here to download employment notice
