AP ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Jobs

AP Contract Basis Jobs Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Contract And Outsourcing Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ నందు ఉన్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ నందు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 13వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.. ఈ ఉద్యోగాల సమాచారం అంతా పూర్తిగా తెలుసుకుని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

▶️ DRDO లో 764 ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన కర్నూలులో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

కర్నూలు మరియు నంద్యాలలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ నందు డాక్టర్స్ (ఫుల్ టైం), ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్, నర్స్ (ANM), వార్డు బాయ్, కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్, పీర్ ఎడ్యుకేటర్, యోగ తెరపిస్ట్ లేదా మ్యూజిక్ లేదా డాన్స్ లేదా ఆర్ట్ టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతల వివరాలు :

నోటిఫికేషన్ లో క్రింది తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

జీతము వివరాలు :

  • డాక్టర్ (ఫుల్ టైం) ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 60,000/- జీతము ఇస్తారు.
  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 25,000/- జీతం ఇస్తారు.
  • నర్సు ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- జీతం ఇస్తారు.
  • వార్డ్ బాయ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 13,000/- జీతం ఇస్తారు.
  • కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 17,500/- జీతము ఇస్తారు.
  • పీర్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 10,000/- జీతము ఇస్తారు.
  • యోగ తెరపిస్ట్ లేదా మ్యూజిక్ లేదా డాన్స్ లేదా ఆర్ట్ టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 5,000/- జీతము ఇస్తారు.

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 13వ తేదీ లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

O/o Addl.DME/Superintendent, Government General Hospital, Kurnool

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఓసి అభ్యర్థులు 250/- రూపాయలు మరియు SC/ST/BC/Physically Challenged candidates 200/- రూపాయలు “Hospital
Development Society Fund, Superintendent, Govt. General Hospital, Kurnool” అనే పేరు మీద చెల్లుబాటు అయ్యేవిధంగా డీడీ తీసి అప్లికేషన్ కు అప్లికేషన్ కు జతపరచాలి.

వయస్సు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 01-07-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.
  • ఎస్సీ ఎస్టీ బీసీ మరియు EWS అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది..
  • PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేయండి.

Download Notification – Click here

Download Application – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *