ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ (AP Contract Basis Jobs) మరియు ఔట్సోర్సింగ్ (AP Outsourcing Jobs) విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుండి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి మరియు పోస్టులను అనుసరించి ఇతర వివిధ రకాల విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
AP Contract and AP Outsourcing Jobs భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది . తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీ మరియు కర్నూలులో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిజియోథెరపిస్ట్, C-Arm టెక్నీషియన్, స్పీచ్ తెరపిస్ట్, O.T టెక్నీషియన్, EEG టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, MNO, FNO అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని రకాల ఉద్యోగాలు కలిపి మొత్తం 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య :
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో కర్నూలు మెడికల్ కాలేజీలో 20 పోస్టులు , కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో 23 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు పదో తరగతి మరియు పోస్టులను అనుసరించి వివిధ రకాల విద్యార్హతలు ఉండాలి. విద్యార్హతలు వివరాలు తెలుసుకునేందుకు మీరు పూర్తి నోటిఫికేషన్ చదవండి.

అప్లికేషన్ తేదీలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జూలై 9 వ తేదీ నుండి జూలై 16వ తేదీ లోపు కర్నూలులో ఉన్న కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
అప్లై చేసే అభ్యర్థులు OC అభ్యర్థులు అయితే 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగతా క్యాటగిరి అభ్యర్థులు అయితే 200/- ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును
ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు అనే పేరు మీద చెల్లి బాట అయ్యే విధంగా ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి అప్లికేషన్ కు జతపరచాలి.
వయస్సు మరియు వయస్సులో సడలింపు వివరాలు :
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 01-07-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
ఉద్యోగాల ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ Official Website – Click here
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here