AP Civil Supplies Corporation limited Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం విశాఖపట్నం నుండి ఔట్సోర్సింగ్ పద్ధతిలో LPG మెకానిక్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ లపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ లో రావాలి అంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా LPG మెకానిక్స్ అనే ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
పదో తరగతి లేదా ఐటిఐ విద్యార్హత కలిగి ఉండాలి.
LPG ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ మరియు రిపేర్ లో మూడు నుండి ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వివిధ ఎల్పిజి బ్రాండ్స్ మరియు మోడల్స్ నందు అనుభవం కలిగి ఉండాలి.
సేఫ్టీ ప్రోటోకాల్స్ మరియు ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ నందు నైపుణ్యం కలిగి ఉండాలి.
వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలకు వయసు 21 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
జీతం :
ఎంపికైన వారికి నెలకు 18,500/- జీతము ఇస్తారు.
అప్లై చేయు విధానము :
అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ లోపు నింపిన దరఖాస్తుకు అట్టేస్టెడ్ జిరాక్స్ కాపీలు జతపరిచి సంబంధిత కార్యాలయంలో స్వయంగా అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవచ్చు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, డోర్ నెంబర్ 11-09-18, దశపల్ల లేఅవుట్, విశాఖపట్నం జిల్లా.
✅ Download Notification – Click here
