ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భీమునిపట్నం మరియు విశాఖపట్నం డివిజన్స్ లో ఉన్న చేసేందుకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తుల కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ అప్లై చేయాల్సి ఉంటుంది.
ఏడవ తరగతి పూర్తి చేసి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్థానికంగా స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
ఎస్సీ , ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు 21 సంవత్సరాలు నిండిన మహిళా అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు వయసు ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ఏడవ తరగతి పూర్తి చేసిన మహిళ అభ్యర్థులు లేకపోతే అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిన వారిని కూడా పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి..
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here
