ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం మళ్ళీ ప్రారంభం – NTR Baby Kits Schem :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాలు అమలులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉన్న తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ , ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి వివిధ పథకాలను మరికొన్ని రోజులలోనే అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే ఇప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా లేని పథకం అయినా కూడా ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చేందుకు గాను ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకాన్ని పునరుద్ధరించింది.
ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం గతంలో అమలు ఉంది కాగా ఆ తర్వాత కాలంలో ఈ పధకం అమలుకు నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం మరలా ఈ పథకాన్ని పునరుద్ధరించారు.
✅ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే మా What’s App Channel లో జాయిన్ అవ్వండి.
🏹 Join Our What’s Channel – Click here
🔥 ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం అనగా ఏమిటి ? :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయబడింది.
ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అయిన గర్భిణీ స్త్రీలకు మరియు కొత్తగా జన్మించిన ఆ శిశువు ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ పథకం మరలా పునరుద్ధరించింది.
ఈ పథకం పునరుద్ధరణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ద్వారా జీవో ఎంఎస్ 61 ను 19.5.2025 తేదిన విడుదల చేసింది.
🏹 AP లో అన్ని జిల్లాల వారికి ఔట్ ఉద్యోగాలు – Click here
🔥 ఎన్టీఆర్ బేబీ కిట్ లో భాగంగా ఏమేమి ఇస్తారు ? :
ఎన్టీఆర్ బేబీ కిట్ లో భాగంగా మొత్తం 11 రకాల సామాగ్రిని గర్భిణీ స్త్రీ లకు అందజేస్తారు.
- దోమతెర కలిగిన బేబీ బెడ్ – 01
- బేబీ రగ్గు – 01
- బేబీ బట్టలు – 02
- బేబీ టవల్ – 02
- బేబీ నాప్ కిన్ – 06
- బేబీ పౌడర్ (జాన్సన్) – 01
- బేబీ షాంపూ (జాన్సన్) – 01
- బేబీ ఆయిల్ (జాన్సన్) – 01
- బేబీ సోప్ (జాన్సన్) – 02
- బేబీ సోప్ బాక్స్ – 01
- బేబీ గిలక్కాయల బొమ్మ – 01
🔥 ఎంత బడ్జెట్ కేటాయించారు :
- ఒక్కొక్క ఎన్టీఆర్ బేబీ కిట్ నకు 1410/- రూపాయల మొత్తం ఖర్చు అవుతుంది.
- ఇందుకు గాను 51,14,77,500 /- రూపాయల మొత్తాన్ని కేటాయించారు.